Wife: పని చెయ్యాలని చెప్పిన భార్య, మొగుడు ఫైర్, భార్యను చంపేసి భర్త ఏం చేశాడంటే ?, గుడికి వెళ్లి వచ్చేసరికి !
భోపాల్/మధ్యప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. కొంతకాలంగా భర్త పనికి వెళ్లకుండా ఇంటికే పరిమితం అయ్యాడు. ఏదైనా పని చెయ్యాలని, మనం ఖాళీగా కుర్చుంటే ఇల్లు గడవడం కష్టం అని భార్య ఆమె భర్తకు చెబుతూ వస్తోంది. రోజూ ఏంది ఈ పంచాయితీ అని రగిలిపోయిన భర్త అతని భార్యను పొడిచి చంపేసి అతను కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో విభోర్ సాహు అలియాస్ విభోర్ అలియాస్ సాహు (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం సాహు రీతూ (24) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న సాహు, రీతూ దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు.

సాహు డ్రైవర్ గా పని చేస్తూ అతని భార్య రీతూను పోషిస్తున్నాడు. సాహుతో పాటు అతని తల్లి, సోదరుడు వీరితోనే కలిసి నివాసం ఉంటున్నారు. గత 20 రోజుల నుంచి ఇంటికే పరిమితం అయిన సాహు పనికి వెళ్లకుండా కాలం గడిపేస్తున్నాడు. పనికి వెళ్లి డబ్బులు సంపాధించాలని, అప్పుడే మనతో పాటు మీ అమ్మా, తమ్ముడు సంతోషంగా ఉంటారని రీతూ ఆమె భర్త సాహుకు చెబుతున్నది.
భార్య రీతూ ఎంతచెప్పినా సాహు మాత్రం పనికి వెళ్లడం లేదు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. భార్య రీతూ తనను ఎక్కువ టార్చర్ పెడుతోందని సాహూ రగిలిపోయాడు. అంతే కత్తిరి తీసుకుని భార్య రీతూను ఇష్టం వచ్చినట్లు పొడిచేసి ఆమెను చంపేసిన సాహు అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సాహు భార్య రీతూ మీద దాడి చేసి చంపేసి అతను ఆత్మహత్య చేసుకునే సమయంలో అతని తల్లి, తమ్ముడు గుడికి వెళ్లారని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి సహదేవ్ రామ్ సాహు మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications