కాశ్మీర్ తీసుకెళ్లి భార్య హత్య: ఆచూకీ లేదంటూ ఫిర్యాదు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని రీసి జిల్లాలో గల కత్రాప్రాంతంలో కొలువై ఉన్న వైష్టో దేవి ఆలయం దర్శనానికి తన భార్యను తీసుకొచ్చిన ఓ దుర్మార్గుడు అక్కడే ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత తనకు ఏమీ తెలియనట్లుగా.. తన భార్య ఆచూకీ తెలియడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు భర్తే హంతకుడని తేల్చారు.
వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీకి చెందిన లక్ష్మీ గుప్తా(25), శక్తి గుప్తా ఇరువురికి ఈ ఏడాది మార్చి 10వ తేదీన వివాహం జరిగింది. ఈ క్రమంలో భార్యతో సహా వైష్ణో మాతా దర్శనానికి వెళ్లాడు.
కాగా, సోమవారం రాత్రి తన భార్యను గొంతునులిమి చంపేశాడు శక్తి గుప్తా. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చీకటీని అనువుగా తీసుకుని మృతదేహాన్ని కొండపై నుంచి కిందకు పడేశాడు.

ఆ తర్వాత, ఏమీ తెలియనట్లు భార్య ఆచూకీ లభించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు సేకరించి విచారణ ప్రారంభించిన పోలీసులకు భర్త తీరుపై అనుమానం కలిగింది.
నిర్ధారణ చేసుకోవడం కోసంగా మృతురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేయగా ఇరువురి మధ్య వివాహం జరిగిన నాటి నుంచి గొడవలు ఉన్నట్లుగా తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. శక్తి గుప్తా తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications