గుట్టు రట్టు: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

Wife, nephew strangle man after he objects to their affair
బెంగళూర్: పక్కా ప్రణాళికతో తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి, సాధారణ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన ఓ మహిళ వ్యవహారం రట్టయింది. చుట్టుపక్కల వారి జోక్యంతో ఆమె చేసిన దురాగతం బయటి పడింది. తన ప్రియుడితో సహకారంతో భార్య తన భర్తను గొంతు నులిమి చంపింది. బుధవారం ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

బాధితుడు డి. దయానందసామి (55) ఆస్పత్రిలో మరణించాడు. నిందితులైన రత్నమ్మ దయానందసామి (33), ఆమె ప్రియుడు చెన్నబసవ (27)లను జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. చెన్నబసవ స్వయంగా హతుడు దయానందసామికి మేనల్లుడు. రత్నమ్మ, చెన్నబస బెంగళూర్‌లోని జలహళ్లి నివాసంలో దయానందసామి మంగళవారం రాత్రి గొంతు నులిమి చంపారు.

పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు పిల్లలు ఉన్న దయానందసామి జలహళ్లి సమీపంలో అయ్యంగార్ బేకరీని నడుపుతున్నారు. అరసికెరెకు చెందిన ఆయన 35 ఏళ్ల క్రితం బెంగళూర్ వచ్చి వివిధ హోటళ్లలో కుక్‌గా పనిచేశాడు. 2001లో అతను బేకరీని ప్రారంభించి తన అక్క చిన్న కుమారుడు చెన్నబసవను అసిస్టెంట్‌గా పెట్టుకున్నాడు.

రత్నమ్మతో చెన్నబసవకు అక్రమ సంబంధం ఏర్పడింది. వీరిద్దరు లైంగిక క్రీడ నడుపుతున్నప్పుడు దయానందసామి చూశాడు. దాంతో చెన్నవబసవను వెళ్లిపోవాలని చెప్పాడు. దాంతో అతను వెళ్లిపోయి మరో హోటల్‌లో పనిచేయడం ప్రారంభించాడు. చెన్నబసవతో సంబంధాన్ని వదులుకోకపోతే విడాకులు ఇస్తానని సెప్టెంబర్ మొదటివారంలో దయానందసామీ రత్నమ్మను హెచ్చరించాడు.

మంగళవారం ఉదయం దయానందసామీ వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దాంతో వారిద్దరితో తీవ్ర వాగ్వివాదం జరిగింది. అదే రోజు రాత్రి వారిద్దరు కలిసి దయానందసామి గొంతు నులిమారు. దాంతో అతను స్పృహ కోల్పోయాడు.

దయానందసామి మరణించాడని భావించి రత్నమ్మ, చెన్నబసవ అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. డీహైడ్రేషన్ వల్ల మరణించాడని చెప్పి టెంపోలో అన్ని ఆరసికెరేకు తరలించారు. అయితే చుట్టుపక్కల వాళ్లు చూసినప్పుడు అతను ఊపిరి తీస్తుండడం కనిపించింది. దీంతో వారు పోలీసులకు విషయం చెప్పారు. దాంతో రత్నమ్మ, చెన్నబసవ గుట్టు రట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+