వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Wife: భార్య బ్యాంక్ మేనేజర్, భర్త ?, భార్యను 20 సార్లు పొడిచి, గొంతు చీల్చి చంపేశాడు, టెర్రాస్ లో!

|
Google Oneindia TeluguNews

ఘాజియాబాద్: బాగా చదువుకున్న యువతి, యువకుడు వివాహం చేసుకున్నారు. సంతోషంగా కాపురం చేసిన దంపతులు లైఫ్ ఎంజాయ్ చేశారు. పెళ్లి చేసుకునే సందర్బంలో ఇద్దరూ వేర్వేరు బ్యాంకుల్లో ఉద్యోగాలు చేసేవారు. తరువాత భర్త అతని ఉద్యోగానికి రాజీనామా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చాడు. భార్య మాత్రం బ్యాంకు మేనేజర్ గా ఉద్యోగం చేస్తోంది. పరిస్థితులు తారుమారు కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న భర్త నుదిటిరాత తల్లకిందలు అయ్యింది. అప్పటి నుంచి భార్య సంపాధన మీద భర్త ఆధారపడుతున్నాడు.

ఐదు మందిని పెంచిపోషిస్తున్న లేడీ బ్యాంకు మేనేజర్ ఆమె సంసారాన్ని నెట్టుకుని వస్తోంది. ఇంట్లో దంపతుల మద్య గొడవ మొదలైనాయి. ఆ సందర్బంలో భర్త సహనం కోల్పోయాడు. వంట గదిలో ఉపయోగించే కత్తి తీసుకుని భార్యను ఇష్టం వచ్చినట్లు 20 సార్లకు పైగా పొడిచేశాడు. భార్యను చంపేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడ మీద నుంచి కిందకుదూకేసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.

Illegal affair: నేను లేనప్పుడు ఎందుకు వస్తున్నాడు ?, భార్యను షూ లేస్ తో చంపేసిన సులేమాన్!Illegal affair: నేను లేనప్పుడు ఎందుకు వస్తున్నాడు ?, భార్యను షూ లేస్ తో చంపేసిన సులేమాన్!

బ్యాంకులో ఉద్యోగాలు

బ్యాంకులో ఉద్యోగాలు

ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లోని వసుందరా సెక్టార్ 15లో నివాసం ఉంటున్న కామ్యా మీనా అనే మహిళ ఘాజియాబాద్ లోని బ్యాంక్ అఫ్ బరోడా బ్యాంకు మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నది. 2011లో వికాస్ (38) అనే వ్యక్తితో కామ్యా మీనా వివాహం జరిగింది. వివాహం చేసుకున్న కామ్యా మీనా, వికాస్ దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు.

బ్యాంకు మేనేజర్ హ్యాపీలైఫ్

బ్యాంకు మేనేజర్ హ్యాపీలైఫ్

వికాస్, కామ్యా దంపతులకు గుర్విత్ (8), రుద్ర (3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వికాప్ తండ్రి జగదీష్ (65), ఆయన తల్లికూడా వీరితో పాటు కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. భర్త వికాస్, ఇద్దరు పిల్లలు, అత్తమామలతో కలిసి కామ్యా మీనా చాలాసంతోషంగా జీవించేది.

బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా

బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా

కామ్యా మీనాను వివాహం చేసుకునే సమయంలో వికాస్ నోయిడాలో ఓ ప్రైవేట్ బ్యాంకులో మంచి ఉద్యోగం చేసేవాడు. 2016లో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసిన వికాస్ మంచి వ్యాపారం చేసి జీవితంలో సెటిల్ అయిపోవాలని డిసైడ్ అయ్యాడు. బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసిన వికాస్ అతని భార్య కామ్యా వికాస్ ప్రోత్సాహంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

కరోనా దెబ్బతో వ్యాపారం ఢమాల్

కరోనా దెబ్బతో వ్యాపారం ఢమాల్

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వికాస్ కు కరోనా వైరస్ రూపంలో అతని అనుకున్న ఆశలు మొత్తం తల్లకిందలు అయ్యాయి. కరోనా వైరస్ సమయంలో వికాస్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిని అతని ఆర్థిక పరిస్థితులు తల్లకిందులు అయ్యాయి. అప్పటి నుంచి బ్యాంకు మేనేజర్ కామ్యా మీనా సంపాధన మీద భర్త ఆధారపడుతున్నాడు.

 ఆర్థిక విషయాల్లో తేడాలు

ఆర్థిక విషయాల్లో తేడాలు

భర్త వికాస్, అత్తమామాలు, ఇద్దరు పిల్లలను పెంచిపోషిస్తున్న లేడీ బ్యాంకు మేనేజర్ కామ్యా మీనా ఆమె సంసారాన్ని నెట్టుకుని వస్తోంది. ఇంట్లో వికాస్, కామ్యా మీనా దంపతుల మద్య ఆర్థిక విషయాలకు సంబంధించి కొంతకాలంగా గొడవలు మొదలైనాయి. వికాస్ తల్లిదండ్రులు కామ్యా మీనా దంపతులకు సర్దిచెబుతూ వస్తున్నారు.

లేడీ బ్యాంక్ మేనేజర్ ను 20 సార్లు పొడిచి చంపిన భర్త

లేడీ బ్యాంక్ మేనేజర్ ను 20 సార్లు పొడిచి చంపిన భర్త

ఇంట్లో ఉన్న కామ్యా మీనా, వికాస్ దంపతుల మద్య గొడవ జరిగింది. ఆ సందర్బంలో వికాస్ తల్లి పనిమీద బయటకు వెళ్లింది. వికాస్ తండ్రి జగదీష్ ఇంట్లోనే ఉన్నాడు. ఆసమయంలో వికాస్ సహనం కోల్పోయాడు. వంట గదిలో ఉపయోగించే కత్తి తీసుకున్న వికాస్ అతని భార్య కామ్యా మీనాను ఇష్టం వచ్చినట్లు 20 సార్లకు పైగా పొడిచేశాడు. భార్య కామ్యా మీనాను కత్తితో పొడిచిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వికాస్ అతని ఇంటి మేడ మీద నుంచి కిందకుదూకేసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.

భార్యను చంపేసి బతికిపోయాడు

భార్యను చంపేసి బతికిపోయాడు

ఇంటి కాంపౌండ్ గ్రిల్స్ మీద పడి తీవ్రగాయాలైన వికాస్ ను, అతని భార్య కామ్య మీనాను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే లేడీ బ్యాంక్ మేనేజర్ కామ్యా మీనా ప్రాణం పోయిందని పోలీసులు అన్నారు. తీవ్రగాయాలైన వికాస్ కు ఐపీయూలో చికిత్స చేస్తున్నారని, కేసు విచారణలో ఉందని ఘాజియాబాద్ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

English summary
Wife: A 38-year-old property dealer allegedly stabbed his banker wife multiple times and then slit her throat with a kitchen knife before attempting to end his life by jumping off the terrace of their house in Ghaziabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X