Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: బెడ్ రూమ్ విషయంలో తేడా, భర్త మీద రేప్ కేసు, కులం పేరుతో దూషించాడని కేసు పెట్టిన భార్య !

అహమ్మదాబాద్: యువతి, యువకుడి పరిచయం ప్రేమగా మారింది. రెండు సంవత్సరాలు ప్రేమించుకున్న ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు నిరాకరించారు. కుటుంబ సభ్యులను ఎదిరించిన ప్రియుడు అతని ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన తరువాత యువకుడి కుటుంబ సభ్యులు కలిసిపోయారు. వివాహం చేసుకున్న దంపతులు మొదట్లో సంతోషంగా కాలం గడిపారు. తరువాత రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. బెడ్ రూమ్ లో తనను సుఖ పెట్టాలని, అతనికి ఇష్టం వచ్చినట్లు రొమాన్స్ చెయ్యాలని తన భర్త తనను అనేక రకాలుగా చాలా ఇబ్బంది పెడుతున్నాడని, తనకు ఇష్టం లేకపోయినా తన మీద పదేపదే అత్యాచారం చేస్తున్నాడని, ఇనుపరాడ్ తో చితకబాదుతున్నాడని, కులం పేరుతో తనను దూషిస్తున్నాడని, తన అత్తమామలు కూడా కులం పేరుతో బూతులు తిడుతున్నారని భార్య ఆమె భర్త, అత్తమామల మీద కేసు పెట్టింది.

ప్రేమించుకున్న యువతి, యువకుడు

ప్రేమించుకున్న యువతి, యువకుడు

గుజరాత్ లోని అహమ్మదాబాద్ సమీపంలోని మోహసానా జిల్లాలో రంజిత్, 20 ఏళ్ల స్వప్నా (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) అనే యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. రంజిత్, స్వప్నాకు మూడు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. రంజిత్, స్వప్నాల పరిచయం ప్రేమగా మారింది. రెండు సంవత్సరాలు ప్రేమించుకున్న ప్రేమికులు రంజిత్, స్వప్నా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

 కులాలు వేరుకావడంతో ?

కులాలు వేరుకావడంతో ?


రంజిత్ దర్బార్ కులానికి చెందినవాడు. స్వప్నా ఎస్పీ వర్గానికి చెందిన యువతి. ఇద్దరి కులాలు వేరు అని రంజిత, స్వప్నాకు ముందే తెలుసు. రంజిత్, స్వప్నాల కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. కుటుంబ సభ్యులను ఎదిరించిన ప్రియుడు రంజిత్ గత ఏడాది అతని ప్రియురాలు స్వప్నాను పెళ్లి చేసుకున్నాడు.

 కలిసిపోయిన కటుంబ సభ్యులు

కలిసిపోయిన కటుంబ సభ్యులు

స్వప్నాను వివాహం చేసుకున్న రంజిత్ అతని సొంతఊర్లోనే కాపురం పెట్టారు. ఆ సమయంలో మాకులం వాడిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు ? అంటూ రంజిత్ కుటుంబ సభ్యులు, బంధువులు, ఊర్లోని కొందరు వ్యక్తులు స్వప్నాను దూషించారని తెలిసింది. తరువాత రంజిత్, స్వప్నా దంపతులు అహమ్మదాబాద్ లోని అద్దె ఇంటిలో కాపురం పెట్టారు.

 బెడ్ రూమ్ లో రొమాన్స్ విషయంలో ?

బెడ్ రూమ్ లో రొమాన్స్ విషయంలో ?


పెళ్లి జరిగిన తరువాత రంజిత్ కుటుంబ సభ్యులు కలిసిపోయారు. అప్పుడప్పుడు రంజిత్ కుటుంబ సభ్యులు సిటీలో కొడుకు ఇంటికి వెళ్లి వస్తున్నారు. వివాహం జరిగిన మొదట్లో రంజిత్, స్వప్నా దంపతులు సంతోషంగా కాలం గడిపారు. తరువాత రానురాను రంజిత్, స్వప్నా దంపతుల మద్య బెడ్ రూమ్ లో రొమాన్స్ విషయంలో గొడవలు మొదలైనాయి. రానురాను రంజిత్, స్వప్నా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

Recommended Video

    India's Greatest Spy Ravindra Kaushik Incredible Story
    రేప్ చేశాడని, ఎస్సీ చట్టం కింద కేసు పెట్టిన భార్య

    రేప్ చేశాడని, ఎస్సీ చట్టం కింద కేసు పెట్టిన భార్య


    బెడ్ రూమ్ లో తనను సుఖ పెట్టాలని, తనకు ఇష్టం వచ్చినట్లు రొమాన్స్ చెయ్యాలని తన భర్త రంజిత్ తనను అనేక రకాలుగా చాలా ఇబ్బంది పెడుతున్నాడని, తనకు ఇష్టం లేకపోయినా తన మీద ఐదు నెలల నుంచి పదేపదే అత్యాచారం చేస్తున్నాడని, ఇనుపరాడ్ తో చితకబాదుతున్నాడని అతని భార్య మెహసానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కులం పేరుతో తన భర్త దూషిస్తున్నాడని, తన అత్తమామలు కూడా సిటీకి వచ్చి తనను తక్కువ కులం దానిని అని బూతులు తిడుతున్నారని రంజిత్ భార్య ఆమె భర్త, అత్తమామల మీద కేసు పెట్టింది. అయితే భర్త రంజిత్ మీద గృహ హింస చట్టం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అతని మీద ఎస్పీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చెయ్యలేదని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+