పడకగదిలో ప్రియురాలితో భర్త: తగలబెట్టేసింది

చెన్నై: ఎంత చెప్పినా వినకుండా ప్రియురాలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తపై ఓ మహిళ కోపం పెంచుకుంది. సహనం చచ్చిపోయిన ఆమె.. ప్రియురాలితో పడకగదిలో తన భర్త ఉన్న సమయంలోనే ఆ గదికి తాళం వేసి కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నమక్కాల్ జిల్లాలోని ఓ గ్రామంలో రాజా(35), కళ(30) కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే గత కొంత కాలం నుంచి రాజా పుష్పావతి అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఈ విషయం కళకు తెలిసింది. భర్త వివాహేతర సంబంధంపై కళ పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ భర్త బుద్ధి మారలేదు. దీంతె కళ వారిద్దరిపై కోపం పెంచుకుంది.

wife sets ablaze to husband and his lover after seeing them in bedroom

ఆదివారం రాత్రి రాజా పుష్పావతి నివాసానికి వెళ్లాడు. విషయం తెలిసి ఇక కళ కూడా పుష్పావతి ఇంటికెళ్లింది.

ఇంటికెళ్లి కిటికీలో నుంచి చూడగా రాజా, పుష్పావతి నిద్రిస్తున్నారు. వారు నిద్రిస్తున్న ఇంటి గడియను పెట్టేసి, కిటికిలోంచి వారిపైకి కళ కిరోసిన్ పోసింది. అనంతరం అగ్గిపుల్లతో నిప్పంటించింది. దీంతో పుష్పావతి, రాజా తీవ్రంగా గాయపడ్డారు.

బాధితులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి చుట్టుపక్కలవారు చేరుకున్నారు. మంటలు ఆర్పేసి వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిద్దరూ 60 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కాగా, కళ పరారీలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+