వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూతురుపై తండ్రి ఘోరం: ఆ పరిస్థితిలో భర్తని చంపినా తప్పులేదన్న కోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కన్నతండ్రి కూతురు పైన అఘాయిత్యానికి పాల్పడటంతో ఆగ్రహంతో భర్తను చంపిన మహిళను నిర్దోషిగా పేర్కొంటూ ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది. అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి సుదేశ్‌ కుమార్‌ బుధవారం తీర్పు వెలువరించారు.

'wife won't allow husband to commit such a crime in her presence'

ఆత్మరక్షణలో భాగంగా కన్న కూతురు జరిగే అఘాయిత్యాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భర్తని హత్య చేయడం తప్పుకాదని న్యాయస్థానం పేర్కొంది. బాధిత మహిళ మాట్లాడుతూ... గతంలో ఒకసారి ఇదే దారుణానికి పాల్పడితే అడ్డు చెప్పినందుకు కూతురి కాలు విరగ్గొట్టాడని చెప్పారు.

ఇలాంటి వ్యక్తిని అంతమొందించకపోతే తమ ప్రాణాలు పోయేవని కోర్టులో తన వాదనను వినిపించింది. వాదనలు విన్న న్యాయమూర్తి మహిళను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పారు. కాగా, ఇటీవల మహిళల పైన అఘాయిత్యాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.

English summary
'wife won't allow husband to commit such a crime in her presence'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X