‘పాకిస్థాన్‌కు జై కొడితే తలలు నరికేస్తాం’
కోల్‌కతా: 'జాతి వ్యతిరేక' వ్యాఖ్యల వివాదంపై దేశవ్యాప్తంగా నిరసన కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో పశ్చిమబెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో స్థానిక భారతీయ జనతా పార్టీ నేత అగ్నికి ఆజ్యం పోసే వ్యాఖ్యలతో వివాదాన్ని రగిలించారు. పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం లేపారు.
ఎవరైనా జాతి వ్యతిరేక వ్యాఖ్యలు(పాకిస్థాన్ జిందాబాద్ లాంటి నినాదాలు) చేస్తే తలలు నరుకుతామంటూ హెచ్చరించారు. ఇటీవల రగిలిన వివాదానికి నిరసనగా బీర్‌భూమ్‌లో జరుగుతున్న ర్యాలీనుద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

'పాకిస్తాన్ జిందాబాద్ ' అని ఎవరైనా నినదిస్తే పైనుంచి 6 అంగుళాలు మేర కత్తిరించి పారేస్తామని హెచ్చరించారు. కాగా, సోషల్ మీడియాలో 'అభ్యంతరకరమైన' పోస్ట్ పెట్టడంతో మంగళవారం బీర్‌భూమ్‌లో ఘర్షణలు చెలరేగాయి.
కాగా, పోస్ట్ పెట్టిన విద్యార్థి సుజన్ ముఖర్జీని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకారులు పోలీస్‌స్టేషన్‌పై దాడిచేశారు. అతడ్ని తమకు అప్పగించాలంట ఆందోళనకు దిగారు.
కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. ఫేస్‌బుక్‌లో ఈ కామెంట్ పెట్టిన విద్యార్థి సుజన్ ముఖర్జీ ఇంటిముందు కొంతమంది ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications