అటు కరోనా, ఇటు ఓమిక్రాన్-ధర్డ్ వేవ్ మొదలైనట్లేనా ? కొత్త ఏడాదిలో పీక్-అంటున్న నిపుణులు

భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి తర్వాత సెకండ్ ప్రభావం మొదలై ఆరు నెలలకు తగ్గినా, ఇప్పుడు ధర్డ్ వేవ్ భయాలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఓమిక్రాన్ వైరస్ అయితే పాత వైరస్ కేసుల్లో నమోదవుతున్న పెరుగుదల కూడా కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ధర్డ్ వేవ్ వచ్చేసిందన్న అంచనాలు జనం గుండెల్లో మళ్లీ రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం...

 భారత్ లో వైరస్ కల్లోలం

భారత్ లో వైరస్ కల్లోలం

భారత్ ను ఏ క్షణాన అయిన కోవిడ్ 19 వైరస్ సోకిందో ఆ తర్వాత నుంచి వైరస్ పేరు చెబితేనే జనం భయపడుతున్నారు. ఏ వైరస్ ఏ రూపంలో చుట్టు ముడుతుందో అన్న భయాలు జనాన్ని నిద్ర లేకుండా చేస్తున్నాయి. నిన్న మొన్నటివరకూ కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారీ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదు కాగా.. ఇప్పుడు ధర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి.

ఈ ఏడాది ఆగస్టు తర్వాత ధర్డ్ వేవ్ తప్పదన్న భయాలు ముసురుకున్నాయి. అయితే కాస్త ఆలస్యంగా డిసెంబర్ నాటికి ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పుడు దాదాపు 14 రాష్ట్రాల్లో కరోనా ఓమిక్రాన్ వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి.

 ధర్డ్ వేవ్ వచ్చినట్లేనా?

ధర్డ్ వేవ్ వచ్చినట్లేనా?

కరోనా కేసులతో పాటు ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండటం, ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి లక్షణాల్లేకుండా సాగిపోతుండటం వంటి కారణాలతో ధర్డ్ వేవ్ భయాలు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే బీహార్ లో ధర్డ్ వేవ్ ప్రారంభమైందని ఇవాళ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. అలాగే మిగతా రాష్ట్రాలు కూడా గతంలో సెకండ్ వేవ్ తరహాలోనే రాత్రిపూట కర్ఫూలతో పాటు ఇతర ఆంక్షల్ని అమలు చేయడం మొదలుపెట్టేశాయి. పరిస్ధితుల్లో మార్పు లేకపోతే పగటి పూట కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు తిరిగి అమలు చేసే అవకాశాలూ లేకపోలేదు.

 కొత్త ఏడాదిలో ధర్డ్ వేవ్

కొత్త ఏడాదిలో ధర్డ్ వేవ్

కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించిన మోడలింగ్ అధ్యయనం ప్రకారం, ఫిబ్రవరి 3, 2022 నాటికి భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి ధర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఇతర దేశాల్లో సాగుతున్న తరహాలోనే దీని వ్యాప్తి భారత్ లోనూ ఉండబోతోందని ఐఐటీ నిపుణులు పేర్కొంటున్నారు.

నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ సభ్యుల ప్రకారం, మూడవ వేవ్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలోకి ప్రవేశించే అవకాశముంది. నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ ఛైర్మన్ అయిన విద్యాసాగర్ ప్రకారం, భారతదేశానికి ఒమిక్రాన్ ధర్డ్ వేవ్ బెడద తప్పేలా లేదు. అయితే ఇది సెకండ్ వేవ్ కంటే తక్కువగా ఉంటుందని మాత్రం చెప్తున్నారు.

సెకండ్ వేవ్ తో పోలిస్తే తక్కువే

సెకండ్ వేవ్ తో పోలిస్తే తక్కువే

మూడవ వేవ్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశ జనాభాలో పెరిగిన రోగనిరోధక శక్తి కారణంగా దీని ప్రభావం సెకండ్ వేవ్ కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 7,500 కేసులు నమోదవుతున్నాయి. ఈ సంఖ్య ఫిబ్రవరి నాటికి భారీగా పెరగొచ్చని తెలుస్తోంది. అప్పుడు కోవిడ్ ధర్డ్ వేవ్ పతాకస్ధాయికి వెళ్తుందని అంచనా. అప్పుడు దాన్ని తట్టుకోవాలంటే ఇప్పటినుంచే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+