మోడీకి అద్వానీ కొర్రీ: అందరితో మాట్లాడాకేనని రాజ్‌నాథ్

ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును ప్రకటించడానికి అంగీకరించాలని రాజ్‌నాథ్ సింగ్ అద్వానీని కలిసి కోరినట్లు తెలుస్తోంది. చర్చలు జరుగుతున్నాయని, ప్రధాని అభ్యర్థి పేరును త్వరలోనే ప్రకటిస్తామని, ప్రధాని అభ్యర్థిపై పార్టీలో ఏ విధమైన విభేదాలు లేవని, అంతా సజావుగానే ఉందని పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు.
ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును ప్రకటించే విషయంలో విస్తృత స్థాయిలో పార్టీలో అంగీకారం కుదిరిందని, శుక్రవారం ప్రకటన వెలువడవచ్చునని అంటున్నారు. బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశమైన మోడీ పేరుకు ఆమోద ముద్ర వేస్తుందని, ఆ తర్వాత ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు.
మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి ఎల్‌కె అద్వానీని, సుష్మా స్వరాజ్‌ను ఒప్పించడం రాజ్‌నాథ్ సింగ్‌కు చాలా కష్టమైన పనే అని అంటున్నారు. ఐదు రాష్ట్రాల శానససభ ఎన్నికలు పూర్తయిన తర్వాత మోడీని ప్రధాని అభ్యర్థిగా నియమించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వారిద్దరు అంటున్నారు. అద్వానీ, సుష్మా స్వరాజ్ అంగీకరించకపోయిన తనకు సంక్రమించిన అధికారాలతో రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత మోడీ పేరును ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications