వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరుణానిధి కుటుంబానికి ప్రభుత్వం షాక్: అన్నా పక్కన స్థలానికి నో, కోర్టుకెక్కిన డీఎంకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలకు మెరినా బీచ్ ఒడ్డున నిర్వహించేందుకు తమిళనాడు ప్రభుత్వం అంగీకరించలేదు. అన్నా సమాధి పక్కనే స్థలం కేటాయించాలని కరుణ కుటుంబం ప్రభుత్వాన్ని కోరింది. అందుకు పళనిస్వామి సర్కార్ నిరాకరించింది. గాంధీ మండపం దగ్గర రెండు వేల ఎకరాలు కేటాయించింది.

Recommended Video

జయకు నో, కరుణకు ఏమంటారో!!!

పళని సర్కార్ తీరుపై డీఎంకే ఆందోళన వ్యక్తం చేస్తోంది. గోపాలపురంలోని కరుణ నివాసం వద్ద కార్యకర్తలు నిరసన చేపట్టారు. మెరీనా బీచ్‌లో అంత్యక్రియల కోసం డీఎంకే న్యాయపోరాటం చేస్తోంది. మెరీనాలో అంత్యక్రియల కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మెరినా బీచ్‌లో స్మారక స్థూపాలపై కోర్టు కేసులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. డీఎంకే కోర్టుకు ఎక్కడం ఆసక్తిని రేపుతోంది. రాత్రి పదిన్నర గంటలకు కోర్టు ఈ పిటిషన్‌ను విచారించనుంది. జస్టిస్ జి రమేష్దీనిని విచారించనున్నారు. మెరినా బీచ్‌లో అంత్యక్రియలు జరగకుంటే ఆందోళన చేస్తామని వైకో హెచ్చరించారు.

 Will Kalaignar Karunanidhi get a burial at Marina beach next to Anna or MGR?

కరుణానిధి మృతి పట్ల ముఖ్యమంత్రి పళనిస్వామి సంతాపం తెలిపారు. రాజకీయాలు, సినిమాలు, రచనకు తన జీవితం అంకితం చేశారని చెప్పారు. అన్నాడీఎంకే కార్యకర్తలు శాంతంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వవద్దని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. వైద్యం చేసిన డాక్టర్లకు, కావేరీ ఆసుపత్రి వైద్యులకు థ్యాంక్స్ చెప్పారు. కరుణానిధి గొప్ప నేత అని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. దేశానికి ఆయన లోటు తీరనిది అన్నారు.

తాము తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిశామని, అన్నా సమాధి పక్కన స్థలం కేటాయించమని అడిగామని డీఎంకే నేద దురాయి మురుగన్ అన్నారు. తమ విజ్ఞప్తిని పరిశీలిస్తామని చెప్పారని తెలిపారు. కాగా, కరుణ మృతి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం బుధవారాన్ని పబ్లిక్ హాలీడేగా ప్రకటించింది. వారం రోజులు సంస్మరణ దినంగా నిర్వహిస్తోంది.

English summary
We had met CM and submitted a request for a 'Samadhi' near Anna memorial, he had accepted our request then, but has not communicated anything in this regard till now: Durai Murugan,Senior DMK leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X