Arvind kejriwal నేడు కోర్టులో బాంబు పేల్చనున్నారా? సునీతా కేజ్రీవాల్ వ్యాఖ్యలతో ఉత్కంఠ!!
ఢిల్లీ మద్యం కుంభకోణం లో నేడు సంచలన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? అరవింద్ కేజ్రీవాల్ నేడు కోర్టులో ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ముడుపులు ఎక్కడికి వెళ్లాయి అన్న దానిపైన సంచలన విషయాలు వెల్లడిస్తారా? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు నేడు ఏదో జరగబోతోంది అన్న సంకేతాలను ఇస్తున్నాయా? అంటే అవును అనే చర్చే ప్రస్తుతం జరుగుతుంది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ కస్టోడియల్ రిమాండ్ ముగియడంతో నేడు ఆయనను సిటీ కోర్టులో హాజరు పరచనున్నారు. నేడు ఈడి అధికారులు అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ ను మళ్లీ పొడిగించాలని కోర్టును కోరే అవకాశం ఉంది. ఆయనను మరింత విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు.

అయితే తాజాగా రేపు కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ నిజాలన్నీ వెల్లడిస్తారని లిక్కర్ డబ్బులు ఎక్కడున్నాయో కోర్టులో చెప్పబోతున్నారు అని, దానికి రుజువులు కూడా సమర్పిస్తారని నిన్ననే అరవింద్ కేజ్రివాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈడి అధికారులు తన భర్త అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు.
మంగళవారం తాను కేజ్రీవాల్ ను కలిసినప్పుడు తన భర్త తనతో అనేక విషయాలు చెప్పారని పేర్కొన్న ఆమె, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిజానిజాలు నేడు కోర్టులో చెబుతానని కేజ్రీవాల్ తనతో చెప్పారని వెల్లడించారు. ఈ కేసులో ఇక ఈ క్రమంలోనే నేడు అరవింద్ కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరు కానున్న నేపథ్యంలో ఆయన చెప్పబోయే సంచలనాలు ఏమిటి అన్నది ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
ఒకవైపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ అరవింద్ కేజ్రీవాల్ ను ప్రధాన సూత్రధారిగా ఆరోపిస్తూ అరెస్ట్ చేసింది. కస్టడీలోకి తీసుకుని ఆయనను విచారించింది. ఆయన నుండి అనేక కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో ఆయన నేడు ఏం చెయ్యబోతున్నారు అన్నది మాత్రం ఉత్కంఠను రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications