India-EU Free Trade Deal: ట్రంప్ కు మోడీ టిట్ ఫర్ టాట్-ఈయూతో కలిసి..!
రష్యా నుంచి డిస్కౌంట్ పై చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్దానికి ఆజ్యం పోస్తున్నామనే కారణం చూపి భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని మోడీ (pm modi)సరైన సమయంలో సరైన షాక్ ఇచ్చారు. అమెరికాకు ప్రత్యామ్నాయాలపై పక్కాగా కసరత్తు చేసి మరీ ఐరోపా దేశాల సమాఖ్య (ఈయూ )తో చారిత్రక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా అమెరికా సుంకాలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. దీంతో ట్రంప్ కోపం పరాకాష్టకు చేరుతోంది.
భారత్-ఈయూ చారిత్రక డీల్
భారత్-ఈయూ మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందంపై ఇవాళ సంయుక్త ప్రకటన వెలువడబోతోంది. దీంతో ట్రంప్ విధానాల కారణంగా ఎదురవుతున్న అనిశ్చితికి ఇరు పక్షాలు చెక్ పెట్టబోతున్నాయి. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేయడంలో ఈ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం గుణాత్మక మార్పును తీసుకువస్తుందని భావిస్తున్నారు. వాణిజ్యం, రక్షణ మరియు భద్రత, వాతావరణ మార్పు, కీలకమైన సాంకేతికతలు, నియమాల ఆధారిత ప్రపంచ క్రమాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత్-ఈయూ ఈ డీల్ కుదుర్చుకుంటున్నాయి.

ఈయూ అధినేతలతో మోడీ డీల్
ఇరుపక్షాలు రక్షణ చట్రాల ఒప్పందాన్ని, వ్యూహాత్మక ఎజెండాను కూడా ఆవిష్కరించనున్నాయి. యూరప్ అమెరికా, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, ఇతర ప్రాంతాలతో దాని దౌత్య, ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ డీల్ కుదురుతోంది. తాజాగా 77వ గణతంత్ర వేడుకలకు ప్రత్యేక అతిధులుగా వచ్చిన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ , యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆతిధ్యమిచ్చారు.
భారత్-ఈయూ ఒప్పంద నేపథ్యం
భారత్, ఈయూ 2004 నుండి వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. ప్రతిపాదిత భద్రత, రక్షణ భాగస్వామ్యం రెండు వైపుల లోతైన రక్షణ, భద్రతా సహకారాన్ని సులభతరం చేస్తుంది.అలాగే రక్షణ రంగంలో పరస్పర సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈయూ యొక్క సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ కార్యక్రమంలో భారతీయ సంస్థలు పాల్గొనడానికి దారులు తెరుస్తుంది. రక్షణ సంసిద్ధతను వేగవంతం చేయడానికి సభ్య దేశాలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి దీన్ని రూపొందించారు. 2007లోనే ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య చర్చలు ప్రారంభమైనా మధ్యలో 2013లో నిలిచిపోయాయి. 2022లో తిరిగి ప్రారంభించారు. భారతీయ కార్మికులను యూరప్‌కు తరలించడానికి వీలు కల్పించడంపై అవగాహన ఒప్పందం కూడా ఈ ఒప్పందంలో భాగం.

ట్రంప్ సర్కార్ ఫైర్
మరోవైపు ఈ ఒప్పందంపై ట్రంప్ సర్కార్ ఘాటుగా స్పందించింది. అన్ని వాణిజ్య ఒప్పందాలకు తల్లి అయిన భారతదేశంతో ఒప్పందం చేసుకోవడం ద్వారా యూరప్ తనకు వ్యతిరేకంగా యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని హెచ్చరించింది. యూరప్ రష్యాతో ప్రత్యక్ష ఇంధన సంబంధాలను గణనీయంగా తగ్గించుకుని ఉండవచ్చు, కానీ అమెరికా భారత్ ను సుంకాలతో లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, భారతదేశంలో శుద్ధి చేసిన రష్యన్ చమురు ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఆరోపించారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. కీలక విషయాలపై చర్చ -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్











Click it and Unblock the Notifications