దువ్వుతున్న బిజెపి: మోడీకి రజనీకాంత్ మద్దతు?

కాగా, రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ - రజనీకాంత్‌ను తమ పార్టీలోకి రావాలని అధికారికంగా ఆహ్వానించలేదని తెలిపారు. పార్టీ వర్గాలు మాత్రం రజనీ బిజెపిలోకి వస్తారని, నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో మంగళవారం వార్తలు వచ్చాయి.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణన్ ఇటీవల మాట్లాడుతూ - రజనీకాంత్‌ను ఓ మంచి నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఆ నిర్ణయం బిజెపికి అనుకూలంగానే ఉండేలా చూడాలని కోరినట్లు చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలో రజనీకాంత్ బాధ్యత గల, గౌరవనీయులైన వ్యక్తి అని ఆయన అన్నారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని రజనీ రాజకీయంగా బిజెపికి మద్దతుగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 26న త్రిచిలో పర్యటించనున్నారు. నరేంద్ర మోడీ హాజరుకానున్న త్రిచి సభకు సుమారు లక్షా 50వేల మంది యువత పాల్గొంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే కాక దేశంలోనూ అనేకమంది అభిమానులను కలిగి ఉన్న రజనీ బిజెపి పార్టీకి మద్దతు పలికినట్లయితే పార్టీకి మరింత బలం చేకూరుతుందని పార్టీ రాష్ట్ర నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications