‘‘భారత్ లో చావనైనా చస్తాం కానీ, తిరిగి అక్కడకు మాత్రం వెళ్లం..’’
తూటా నుంచి ఎవరైతే తప్పించుకున్నారో, వారే బర్మా నుంచి బయటపడ్డారని, అవసరమైతే ఇక్కడే చస్తాం కానీ, బర్మాకు మాత్రం మళ్లీ తిరిగి వెళ్లబోమని నూర్ ఆలం అనే రోహింగ్యా ముస్లిం ఆవేదన వ్యక్తం చేశాడు.
బర్మా: మయన్మార్ లో తాము ఒక్క రోజు కూడా ప్రశాంతంగా పడుకోలేదని, ఏ క్షణంలోనైనా ఆర్మీ వచ్చి విరుచుకుపడేదని, క్షణక్షణం ప్రాణాలు అరచేత పెట్టుకుని బతికామని భారత్ లో అక్రమంగా చొరబడి, శరణార్థులుగా బతుకీడుస్తున్న రోహింగ్యా ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇండియాలో చెత్తకుప్ప పక్కన పడుకున్నా, బతుకుతామనే ధైర్యం ఉందని... రాత్రి ఎలా గడుస్తుందో అనే బెంగ లేదని తెలిపారు. ఢిల్లీలోని షహీన్ బాగ్ లో చెత్తకుప్ప పక్కన నివసిస్తున్న నూర్ ఆలంతో పాటు మరి కొందరు రోహింగ్యాలు చెప్పిన మాట ఇది.

ఈ ప్రాంతంలో 72 రోహింగ్యా శరణార్థ కుటుంబాలు నివసిస్తున్నాయి. 12 మంది కుటుంబసభ్యులతో కలసి నూర్ ఆలం నివసిస్తున్నాడు. ఇక్కడ కటిక పేరదరికం అనుభవిస్తున్నప్పటికీ, ప్రశాంతంగా ఉన్నామని అతను తెలిపాడు.
గత కొన్నేళ్లుగా మయన్మార్ (బర్మా) లోని రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యా తిరుగుబాటుదారులకు, ఆర్మీకి మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్ లో ఆర్మీ భారీ ఎత్తున తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్ ను చేపట్టింది.
ఈ క్రమంలో.. ఊళ్లకు ఊళ్లు నాశనం అయిపోయాయి. అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో, వేలాది మంది రోహింగ్యాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, పొరుగు దేశాలకు పారిపోయారు.
అలాంటి వారిలో నూర్ ఆలం కూడా ఒకరు. సైనిక ఆపరేషన్ ను తప్పించుకుని అతను బర్మాను వీడాడు. సైనిక ఆపరేషన్ లో ఆయన తన దూరపు కుటుంబసభ్యులందరినీ కోల్పోయాడు. ఈ క్రమంలో, తనతో పాటు మరికొందరితో కలసి 15 రోజుల పాటు నడిచి బంగ్లాదేశ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి భారత్ లో ప్రవేశించాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తూటా నుంచి ఎవరైతే తప్పించుకున్నారో, వారే బర్మా నుంచి బయటపడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. అవసరమైతే ఇక్కడే చస్తాం కానీ, బర్మాకు మాత్రం మళ్లీ తిరిగి వెళ్లబోమని చెప్పాడు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
ట్రంప్‌కు తలనొప్పి.. పుతిన్‌కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications