అయోధ్య-బాబ్రీ మసీదు సమస్య భూవివాదమే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసు కేవలం భూవివాదమని, దీనిని సాధారణ పిల్‌గానే విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదంపై తుది విచారణ గురువారం ప్రారంభమైంది. దీనిపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లి నవారి వాదనలు మొదట వింటామని చెప్పింది.
ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.

ఓ సందర్భంలో అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ ప్రతివాదనలు కావాలని తాము అడగడం లేదని, ప్రతిపాదనలు వస్తే ఊహాగానాలు వస్తాయని, ఊహాగానాలు వల్ల ఏదో ఒక అభిప్రాయం కలుగుతుందని, అభిప్రాయాలు అబద్దాలకు దారి తీస్తాయని, అబద్దాలతో అవివేకం కలుగుతుందని, అది ప్రమాదకరంగా మారుతుందని, చివరికి మనిషిని చంపేస్తుందని వ్యాఖ్యానించింది.
ఈ కేసును రోజువారీ విచారించమని తెలిపింది. న్యాయం కోసం 700 మంది పేదలు ఎదురు చూస్తున్నారని, వారి కేసులు పరిశీలించాల్సి ఉందన్నారు. భూమికి సంబంధించి ఇరు పక్షాలు డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశఇంచింది. చరిత్రకు తమకు సంబంధం లేదని, దీనిని భూవివాదంగానే చూస్తామని తెలిపింది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications