మోడీని ట్రంప్ కిడ్నాప్ ? కాంగ్రెస్ మాజీ సీఎం షాకింగ్..!
తాజాగా వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫోర్స్ ను అమెరికా డెల్టాఫోర్స్ బలవంతంగా అరెస్టు చేసి తమ దేశానికి తీసుకెళ్లడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనకు నచ్చని దేశాధినేతను కుటుంబంతో సహా ఇలా అరెస్టు చేసి బలవంతంగా ఎత్తుకెళ్లిపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్న భారత్ పై మరిన్ని సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరికలు కూడా చేశారు.
ఈ రెండు అంశాల్ని కలుపుతూ మన ప్రధాని మోడీని కూడా ట్రంప్ కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తారా అంటూ మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృధ్వీరాజ్ చవాన్ ఇవాళ ప్రశ్నించారు. వెనిజులాలో జరిగినది భారతదేశంతో కూడా జరుగుతుందా అని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. 50 శాతం సుంకంత వాణిజ్యం సాధ్యం కాదని, వాస్తవానికి, ఇది భారతదేశం-అమెరికా వాణిజ్యాన్ని, ముఖ్యంగా భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతులను నిరోధించడానికి సమానం అన్నారు.

ప్రత్యక్ష నిషేధం విధించలేక, వాణిజ్యాన్ని ఆపడానికి సుంకాలను ట్రంప్ ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారని చవాన్ ఆరోపించారు. భారతదేశం దీనిని భరించాల్సి ఉంటుందన్నారు. మన ప్రజలు గతంలో అమెరికాకు ఎగుమతుల ద్వారా సంపాదించిన లాభాలు ఇకపై అందుబాటులో ఉండవన్నారు. మనం ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం వెతకాలని, ఆ దిశలో ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయని వెల్లడించారు. ట్రంప్ వెనిజులాతో చేసినట్లే భారతదేశంతో చేస్తే? అని చవాన్ ప్రశ్నించారు. చవాన్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని గౌరవాన్ని తగ్గించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications