ఎన్నికల ప్రచారానికి మేడమ్ వస్తారా ?, లేదా ?, మాజీ సీఎం మనవికి సీఎం రియాక్షన్!

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా చాపకింద నీరులా అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మరోసారి వెలుగు చూసింది. మీ పార్టీ తరుపున నేను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తానని హామీ ఇచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్రస్ లేకుండా పోవడంతో ఆమెను నమ్ముకున్న జేడీఎస్ పార్టీ నాయకులు అయోమయంలో పడిపోయారు.

దేశం మొత్తం ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద కన్నుపడింది. లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతకాలం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా ?, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా ?, లేదా ప్రాంతీయ పార్టీ జేడీఎస్ పార్టీ లాభం పొందుతుందా ? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Will West Bengal CM Mamata Banerjee support JDS Party in Karnataka Assembly Elections?

గతంలో జరిగిన తప్పులు మరోసారి చెయ్యకూడదని జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగాయి ఇక బీజేపీ ఎవ్వరితో పొత్తు లేకుండా ప్రతిసారి ఒంటరిగా పోటీ చేస్తున్నది. ఇప్పటికే కర్ణాటక కింగ్ మేకర్ గా గుర్తింపు తెచ్చుకున్న జేడీఎస్ దళపతి హెచ్ డీ. కుమారస్వామి ఆయన స్కెచ్ ల్లో ఆయన ఉన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ దళపతి హెచ్.డీ. కుమారస్వామి కోల్ కత్తా వెళ్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మీరు ప్రచారం చెయ్యాలని మాజీ సీఎం కుమారస్వామి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మనవి చేశారు.

కచ్చితంగా తాను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి హామీ ఇచ్చారని తెలిసింది. అయితే మమతా బెనర్జీ మాత్రం ఇంత వరకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరుపున ఎన్నికల ప్రచారం చెయ్యడానికి రాలేదు.

మమతా బెనర్జీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలక ప్రచారానికి మమతా బెనర్జీ వస్తారా ? లేదా ? అనే విషయంలో ఇంత వరకు జేడీఎస్ పార్టీ నాయకులే క్లారిటీ ఇవ్వడం లేదు. కాకపోతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ టూ జెడ్ అన్ని మేమే కావాలని జేడీఎస్ దళపతులు హెచ్ డీ. దేవేగౌడ, మాజీ సీఎం కుమారస్వామి, మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ డిసైడ్ అయ్యారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+