వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చలకు రెడీ, ఆ యాత్రకు ప్రత్యామ్నాయాలు: చైనా బంపర్ ఆపర్

భారత పర్యాటకుల కోసం ఇతర మార్గాల ద్వారా కైలాస్ మానస సరోవరం యాత్రకు చేరుకొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని చైనా ప్రకటించింది.ఈ మేరకు తాము భారత్ తో చర్చలకు సిద్దంగా ఉన్నట్టు .

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:భారత పర్యాటకుల కోసం ఇతర మార్గాల ద్వారా కైలాస్ మానస సరోవరం యాత్రకు చేరుకొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని చైనా ప్రకటించింది.ఈ మేరకు తాము భారత్ తో చర్చలకు సిద్దంగా ఉన్నట్టు చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది.

భారత బలగాలు చైనా భూబాగంలోకి ప్రవేశించడంతోనే భారతీయుల కైలాష్ మానస సరోవరం యాత్రను నిలిపివేశామని చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది.

Willing to discuss alternative arrangements for Mansarovar pilgrims, says China

అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం చర్చించేందుకు సిద్దమేనని చైనా ప్రకటించింది.ఈ మేరకు న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం అధికారి ప్రతినిధి గ్జీ లియాన్ ఓక ప్రకటన విడుదల చేశారు.

చైనా భారత్ ప్రజలతో ప్రజల అనుబంధానికి సాంస్కృతిక సంబంధాలకు కైలాష్ మాసన సరోవరం యాత్రను ముఖ్యమైన భాగంగా భావిస్తోందన్నారాయన. భారతీయ ప్రజల మత మనోభావాలను చైనా గౌరవిస్తూనే వస్తోందన్నారు. జిజాంగ్ లోని కైలాస్ మానస సరోవరం యాత్రకు ప్రాధాన్యతమిస్తోందన్నారు.

మానస సరోవరానికి లిపులెకు పాస్ మీదుగా అధికారిక యాత్ర, లాస్ అండ్ పురంగ్ మీదుగా అనధికారిక యాత్ర ప్రస్తుతానికి యధాతదంగా సాగుతోందని, నాథులా పాస్ మీదుగా నిలిచిపోయిన ఈ యాత్ర కోసం ఇప్పటికే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.

2014 లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ వచ్చిన సందర్భంగా నాథులా పాస్ మీదుగా మానస సరోవరం యాత్రను ఆ దేశం అనుమతించింది. 2016 లో తెరిచిన ఈ మార్గాన్ని తాజాగా సిక్కింలోని సరిహద్దులో ఇరుదేశాల సైన్యాల మధ్య ఏర్పడిన ఘర్షణ కారణంగా మూసివేశారు.

English summary
China on Wednesday said that it was forced to halt the entry of Indian pilgrims to Kailash Mansarovar through the Nathu La pass after Indian troops “crossed into Chinese territory” and that it is willing to discuss the possibility of alternative arrangements through other routes for Indian yatris.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X