తేదీలొచ్చాయ్: ఇక.. రణరంగమే
Winter Parliament Sessions: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి తెల్లవారు జాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు. ఇక చివరిదైన రెండో విడత పోలింగ్ ఈ నెల 11వ జరుగనుంది. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ భవితవ్యాన్ని ఖరారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీఏ గెలిస్తే.. ముందుగా అనుకున్నట్టే 2027లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోన్నట్లు తెలుస్తోంది. 2027 ఫిబ్రవరి నుంచి ఆరు నెలల్లో విడతల వారీగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జమిలి ఎన్నికలను నిర్వహించేలా కేంద్రం చర్యలు తీసుకుంటోన్నట్లు సమాచారం.

ఈ పరిస్థితుల మధ్య పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు వెలువడ్డాయి. డిసెంబర్ 1వ తేదీన పార్లమెంట్ ఉభయసభలు సమావేశం కానున్నాయి. 19వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చించిన అనంతరం ఎన్ని రోజుల పాటు లోక్ సభ, రాజ్యసభ సమావేశాలను కొనసాగించాలనేది నిర్ధారిస్తారు. గరిష్టంగా 19వ తేదీ వరకు ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ సమావేశాలు సజావుగా సాగడానికి అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
The Hon’ble President of India Smt. Droupadi Murmu ji has approved the proposal of the Government to convene the #WinterSession of #Parliament from 1st December 2025 to 19th December, 2025 (subject to exigencies of Parliamentary business).
— Kiren Rijiju (@KirenRijiju) November 8, 2025
Looking forward to a constructive &… pic.twitter.com/QtGZn3elvT
ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ- బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ పార్లమెంట్ సమావేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయనే అంచనాలు ఉన్నాయి. ఎన్డీఏ గెలిస్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు, దానికి సంబంధించిన పూర్వాపరాల గురించి ఉభయ సభల్లో ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి విజయం సాధించితే.. సభలో ప్రతిపక్షాల స్వరం గణనీయంగా పెరుగుతుంది. అధికార పక్షాన్ని మరింత ఎడగడతాయి.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications