• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ భూత్ బంగ్లా ఢమాల్: 70 కేజీల ఆర్ డీఎక్స్ (వీడియో)

|

చెన్నై: ప్రమాదకర స్థాయిలో ఉన్న 11 అంతస్తుల భవనం నేలమట్టం చేశారు. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని మౌళివాక్కంలో బుధవారం రాత్రి 11 అంతస్తుల భవనాన్నికేవలం మూడు సెకన్లలో నేలమట్టం చేయడంతో ఆ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు ఊపిరిపీల్చుకున్నారు.

దక్షిణ భారత దేశ చరిత్రలోనే ప్రపథమంగా చెన్నై నగరంలోని మౌళివాక్కంలో నిర్మాణంలో ఉన్న ప్రైమ్ సృష్టి సంస్థకు చెందిన 11 అంతస్తుల భవనం కుప్పకూలడంతో సర్వత్రా ఉలిక్కిపడింది. ఆ భవనం కూప్పకూలడం చూడాలని పరిసర ప్రాంతాల ప్రజలు దాదాపు నాలుగు గంటల పాటు ఉత్కంఠగా ఎదురు చూశారు.

61 మంది అమాయకులు బలి

61 మంది అమాయకులు బలి

2014 జూన్ 28 వ తేది సాయంత్రం మౌళివాక్కంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ప్రమాధంలో తమిళనాడు, ఉత్తరాంధ్ర, ఒడిశాలకు చెందిన 61 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 27 మందికి తీవ్రగాయాలైనాయి.

నిర్మాణ లోపమే కారణం

నిర్మాణ లోపమే కారణం

61 మంది ప్రాణలను బలి తీసుకున్న భవనం సమీపంలో దర్శనం ఇస్తున్న మరో 11 అంతస్తుల భవనం నుంచి మాకు ఎలాంటి ప్రమాదం ఎదురౌతుందే అని స్థానికులు హడలిపోయారు. గత రెండు సంవత్సరాల నుంచి ఆ భవనం చూస్తు వారు భయంతో తల్లడిల్లిపోయారు.

ఆ భవనం కూల్చేయండి

ఆ భవనం కూల్చేయండి

11 అంతస్తుల భవనం కూడా బలహీనంగా ఉందని, అది ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేమని అధికారులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఆ భవనం నేలమట్టం చెయ్యాలని నిర్ణయించింది. భవనం యజమానులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం కోర్టులో తమ వాదనలు వినిపించింది.

టెన్షన్ టెన్షన్

టెన్షన్ టెన్షన్

సెప్టెంబర్ నెలలో ఈ 11 అంతస్తుల భవనం కూల్చివేయాలని నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలో దానిని వాయిదా వేశారు. తరువాత బుధవారం భవనం కూల్చివేయడానికి కసరత్తులు మొదలు పెట్టారు.

మ్యాగ్ లింక్ ఇన్ ఫ్రా ప్రాజెక్టు

మ్యాగ్ లింక్ ఇన్ ఫ్రా ప్రాజెక్టు

11 అంతస్తుల భవనం కుప్పకూల్చడానికి మ్యాగ్ లింక్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వర్గాలు రంగంలోకి దిగాయి. ఏడు మందితో కూడిన ప్రత్యేక బృందం 50 రోజుల పాటు శ్రమించింది. గ్రౌండ్, మొదటి, ఐదో అంతస్తుల్లో పేలుడు పదార్థాలు పెట్టాలని నిర్ణయించారు.

70 కేజీల ఆర్ డీఎక్స్

70 కేజీల ఆర్ డీఎక్స్

11 అంతస్తలు భవనం నేలమట్టం చేయడానికి 70 కేజీల ఆర్ డీఎక్స్, గన్ పౌడర్, రసాయనాల మిశ్రమాలతో తయారు చేసిన పేలుడు పదార్థాలను ఆ భవనంలో 150 చోట్ల రంధ్రాలు వేసి అమార్చారు.

కార్యచరణ సిద్దం

కార్యచరణ సిద్దం

పేలుడు పదార్థాలు అన్నింటినీ అనుసంధానించే విధంగా పక్కా ప్లాన్ తో ఇన్ ఫ్లోజర్ పద్దతిలో పేలుడు పదార్థాలను పెట్టారు. గ్రౌండ్, మొదటి, ఐదవ అంతస్తులోని పేలుడు పదార్థాలను మూడు రిమోట్ల ఆధారంగా పేల్చేయాలని నిర్ణయించారు.

ప్రజలను ఖాళీ చేయించారు

ప్రజలను ఖాళీ చేయించారు

బుధవారం మౌళివాక్కంలోని 11 అంతస్తుల భవనం ఉన్న పరిసర ప్రాంతాల్లో 250 మీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించారు. వారిని సురక్షింతంగా కల్యాణ మండపాలకు తరలించారు. ఆపరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. 10 అగ్నిమాపక వాహనాలు, 10 ఆంబులెన్స్ లు 150 మీటర్ల దూరంలో సిద్దం చేశారు.

పోలీసులు, రెవెన్యూ అధికారులు

పోలీసులు, రెవెన్యూ అధికారులు

12 ప్రత్యేక బృందాల పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ భవనం కూల్చి వేయడానికి రంగం సిద్దం చేసుకున్నారు. మద్యాహ్నం మూడు గంటలకు, తరువాత నాలుగు గంటలకు, చివరికి ఐదు గంటలకు భవనం నేలమట్టం చేస్తామని అధికారులు ప్రకటించారు.

భవనాల మీద తిష్టవేశారు

భవనాల మీద తిష్టవేశారు

స్థానిక ప్రజలు ఆ భవనాన్ని ఎలా నేలమట్టం చేస్తారు ? అని చూడటానికి పరిసర ప్రాంతాల్లోని భవనాల మీదకు వెళ్లి నిలబడ్డారు. సాయంత్రం ఆరు గంటలు అయినా భవనం కూల్చలేదు. మూడు సార్లు వర్షం పడటంతో ఇక ఈ భవనం కూల్చరు అని ప్రజలు భావించారు.

హమ్మయ్యా అయిపోయింది

హమ్మయ్యా అయిపోయింది

రాత్రి ఆ భవనం నేలమట్టం అయ్యింది. కేవలం మూడు సెకన్లలో భవనం కుప్పకూలింది. చిమ్మచీకటిలో దట్టమైన పొగరావడంతో స్థానికులు తల్లడిల్లిపోయారు. రూ. 50 లక్షల ఖర్చు పెట్టి ఈ భవనం నేలమట్టం చేశామని మ్యాగ్ లింక్ సంస్థ నిర్వహకుడు పొన్నులింగం మీడియాకు చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Chennai Metropolitan Development Authority (CMDA) officers announced, we will demolish an 11storey building at Moulivakkam in Chennai on Wednesday. Where one of its twin towers collapsed on July 28, 2014 killing 61 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more