లోక్ సభలో వైసీపీ షాక్ తో రూటు మార్చిన మోడీ- వ్యూహాత్మకంగా ట్విస్ట్..!
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటు కాకముందు వైసీపీతో చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన ప్రధాని మోడీ.. ఎన్నికల వేళ రూటు మార్చారు. టీడీపీ, జనసేనతో కూడిన కూటమితో బీజేపీ జట్టు కట్టడంతో వైఎస్ జగన్ ను దూరం పెట్టారు. దీని ప్రభావం ఇప్పుడు పార్లమెంట్ లో కనిపిస్తోంది. లోక్ సభలో నలుగురు, రాజ్యసభలో 11 మంది ఎంపీలు కలిగిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఇప్పుడు ఓ కీలక బిల్లుకు మోకాలడ్డింది. దీంతో ప్రధాని మోడీ రూటు మార్చుకోక తప్పలేదు.
మహారాష్ట్ర, హర్యానాలో త్వరలో జరిగే ఎన్నికల్లో లబ్ది కోసం కేంద్రంలో ఎన్డీయే సర్కార్ అనూహ్యంగా వక్ఫ్ చట్టం సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. అయితే దీన్ని విపక్ష ఇండియా కూటమితో పాటు ఎన్డీయే కూటమిలో లేని తటస్థ పార్టీలైన వైసీపీ, బీజేడీ, ఎంఐఎం వంటి పార్టీలు వ్యతిరేకించాయి. దీంతో కేంద్రం ఇరుకున పడింది. చివరికి ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక కేవలం రాజకీయ ప్రత్యర్థుల వ్యతిరేకత మాత్రమే ఉందని తొలుత అంతా భావించారు. కానీ జరిగింది వేరు.

లోక్ సభలో గతంలో మోడీ సర్కార్ తెచ్చిన చాలా బిల్లులకు ఏ కూటమిలో లేకపోయినా వైసీపీతో పాటు బీజేడీ కూడా మద్దతు పలికాయి. కానీ తాజాగా ఏపీ, ఒడిశా ఎన్నికల్లో బీజేపీ నిర్ణయాలతో ఇప్పుడు ఈ రెండు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా మారాయి. ఈ నేపథ్యంలో నిన్న లోక్ సభలో పెట్టిన వక్ఫ్ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. అయినా లోక్ సభలో ఎన్డీయేకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ రాజ్యసభలో మాత్రం ఎన్డీయే మెజార్టీకి 12 మంది ఎంపీల దూరంలో ఉంది. అదే సమయంలో గతంలో పలుమార్లు మద్దతిచ్చిన 11 ఎంపీల వైసీపీ, 9 ఎంపీల బీజేడీ దూరమయ్యాయి. బీజేడీ సంగతి ఎలా ఉన్నా వైసీపీ మద్దతు లేకపోతే మాత్రం రాజ్యసభలో వక్ఫ్ బిల్లు నెగ్గించుకోవడం కష్టం. అందుకే వ్యూహాత్మకంగా ఈ బిల్లును రాజ్యసభ ఎన్నికలు అయ్యే వరకూ జేపీసీకి పంపి కేంద్రం వ్యూహాత్మకంగా చేతులు దులుపుకుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications