రైల్వే స్టేషన్ లో కిడ్నాప్, నాలుగు రోజులు ఆంటీ మీద గ్యాంగ్ రేప్: కొడుకు, కూతురిని కట్టేసి !
ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. బిడ్డలతో పాటు ఊరికి బయలుదేరిన వివాహిత మహిళను కిడ్నాప్ చేసి ఓ ఇంటిలో నిర్బంధించిన కామాంధులు ఆమెను నగ్నంగా తయారు చేసి నాలుగు రోజుల పాటు ఆమె మీద సామూహిక .
లక్నో: ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. బిడ్డలతో పాటు ఊరికి బయలుదేరిన వివాహిత మహిళను కిడ్నాప్ చేసి ఓ ఇంటిలో నిర్బంధించిన కామాంధులు ఆమెను నగ్నంగా తయారు చేసి నాలుగు రోజుల పాటు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు.
బిడ్డలను గదిలో కట్టేసిన కామాంధులు వివాహిత మీద అత్యాచారం చేశారు. కామాంధులకు మరో ఇద్దరు మహిళలు సహకరించారని బరేలీ అడిషనల్ పోలీసు కమిషనర్ పంకజ్ పాండే చెప్పారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నామని పంకజ్ పాండే వివరించారు.

40 ఏళ్ల మహిళకు
40 ఏళ్ల మహిళకు 11 ఏళ్ల కుమార్తె, 13 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఈనెల 16వ తేదీన ఆమె కుమారుడు, కుమార్తెను పిలుచుకుని ఊరికి బయలుదేరింది. బరేలీ రైల్వేషన్ లో రైలు దిగిన మహిళ కుమార్తె, కుమారుడితో కలిసి రైల్వేష్టేషన్ బయటకు వచ్చింది.

ఆంటీ, పిల్లలు కిడ్నాప్
రైల్వే ష్టేషన్ నుంచి బయటకు వచ్చిన మహిళను పిల్లలతో కలిసి ఓ వాహనంలో పానిపట్ ప్రాంతానికి బయలుదేరింది. ఆ సందర్బంలో ముగ్గురు యువకులు ఆమెతో పాటు ఇద్దరు పిల్లలను అదే వాహనంలో కిడ్నాప్ చేశారు. తరువాత ఓ ఇంటి దగ్గరకు తీసుకెళ్లారు.

ఒకే ఇంటిలో తల్లి, పిల్లలు
40 ఏళ్ల మహిళను రహస్య ప్రాంతంలోని ఇంటిలోకి తీసుకెళ్లారు. తరువాత ఆమె కుమారుడు, కుమార్తె కాళ్లు, చేతులు కట్టేశారు. నాలుగు రోజుల పాటు ఇద్దరు యువకులు ఆమె మీద నిరంతరం అత్యాచారం చేశారు. పిల్లలు కళ్ల ముందే అత్యాచారం చెయ్యడంతో ఆమె షాక్ కు గురైయ్యింది.

తప్పించుకున్న మహిళ
సోమవారం ఇంటిలో నుంచి కామాంధులు బయటకెళ్లారు. ఆ సందర్బంలో ఆమె పిల్లలను అక్కడే వదిలి పెట్టి ఆమె మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వడానికి తప్పించుకుంది. చివరికి నానా ఇబ్బందులు ఎదుర్కొని పోలీసులను ఆశ్రయించింది.

జిన్నూరు ఏరియాలో !
బాధితురాలి కథనం మేరకు ఆమెను జిన్నూరు సమీపంలోని ఓ ఇంటిలో నిర్బంధించారని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని బరేలీ ఎస్పీ రవిశంకర్ చబ్బి అన్నారు. మహిళ మీద ఇద్దరు కామాంధులు నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారని చందయాసి పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన చెప్పారు.

లేడీ కిలాడీలు
40 ఏళ్ల మహిళ మీద సామూహిక అత్యాచారం చేసిన ఇద్దరు కామాంధులకు మరో ఇద్దరు మహిళలు సహకరించారని బాధితురాలు సమాచారం ఇచ్చిందని ఎస్పీ రవిశంకర్ చబ్బి చెప్పారు. ఇద్దరు యువకులతో పాటు మరో ఇద్దరు మహిళ మీద కేసు నమోదు చేశారని రవిశంకర్ చబ్బి స్పష్టం చేశారు.

పిల్లల ముందే !
పిల్లల ముందే తన మీద నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసుల ముందు విలపించింది. తన కుమార్తె ఏమీ చెయ్యలేకపోయిందని, 13 ఏళ్ల కుమారుడు కట్లు విడిపించుకోవడానికి చాలసార్లు ప్రయత్నించినా అతనికి సాధ్యం కాలేదని బాధితురాలు చెప్పిందని పోలీసులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications