బిఎస్పీ నేత కొడుకు పని: ఫ్రెండ్ ఎదుటే మహిళపై రేప్
బెంగళూర్: బిఎస్పీ నేత కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. 22 ఏళ్ల మహిళను అపహరించి, ఆమెపై కారులో అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె ప్రెండ్ ఎదుటే అతను ఈ దాష్టీకానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బిఎస్పీ నేత కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో ఈ సంఘటన శుక్రవారంనాడు జరిగింది.
ఈ సంఘటనలో పోలీసులు నసీర్ హైదర్ (23)ను అరెస్టు చేశారు. అతనికి సహకరించిన నలుగురు మిత్రులు పరారీలో ఉన్నారు. తాను తన మేల్ ఫ్రెండ్‌తో కలిసి తన అపార్టుమెంటు కాంప్లెక్స్ ఎదుట కూర్చున్నానని, ఆ సమయంలో నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఆ మహిళ ఫిర్యాదులో చెప్పింది.

వాళ్లు కారులో మహిళను, ఆమె మేల్ ఫ్రెండ్‌ను నగరమంతా తిప్పారు. తన మేల్ ఫ్రెండ్‌ను తుపాకితో బెదిరించి, ఆ నలుగురిలో ఒకతను తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది. మిత్రులతో కలిసి తాను డిన్నర్‌కు బయటకు వెళ్లానని, మేల్ ఫ్రెండ్ తనను, మరో ఇద్దరిని ఇంటి వద్ద హోండా సిటీ కారులో దించడానికి సిద్ధపడ్డాడని ఆమె వివరించింది.
ఆ ఇద్దరు మిత్రులను ఇంటి వద్ద దింపేసిన తర్వాత తమ ఇంటికి వచ్చామని, అప్పటికి అర్థరాత్రి అయిందని, తాము కారులోని కూర్చుని మాట్లాడుకుంటుండగా తెల్ల స్కోడా ఫాబియా కారు తమను దాటిపోయిందని ఆమె వివరించింది.
అనంతరం అర్థరాత్రి దాటిన తర్వాత ఆ కారు తిరిగి వచ్చిందని, నలుగురు వ్యక్తులు కారు నుంచి దిగి తమవైపు దూసుకొచ్చారని, ఆ కారులో తాము ఆ నలుగురిని తురుచూ చూస్తున్నామని, పోలీసులమని చెప్పుకుని కారు డోర్ తెరవాలని నలుగురు వ్యక్తులు తమతో అన్నారని ఆమె చెప్పింది.
తమను కారు వెనక సీట్లోకి తోసేశారని, ఇద్దరు వ్యక్తులు తమ ఇద్దరికి ఇరువైపులా కూర్చున్నారని, మరో ఇద్దరు ముందు సీట్లో కూర్చున్నారని అన్నారు. హైదర్ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. చివరకు ఆమె మేల్ ఫ్రెండ్ వాచ్‌ను లాక్కుని వారిద్దరిని వదిలేసి పోయారు.












Click it and Unblock the Notifications