భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్... స్నేహితులతో కలిసి మరిది అఘాయిత్యం...
రాజస్తాన్‌లో దారుణం జరిగింది. ఓ మహిళపై ఆమె మరిది(మాజీ భర్త సోదరుడు) అతని స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డాడు. భర్తతో కలిసి బయటకెళ్లిన ఆమె.. తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో ఆ గ్యాంగ్ అడ్డగించారు. బలవంతంగా ఇద్దరినీ సమీపంలోని పంట పొలాల వద్దకు లాక్కెళ్లారు. ఆమె భర్తపై దాడి చేసి అతని కాళ్లు,చేతులు తాళ్లతో కట్టిపడేశారు. అనంతరం అతని ముందే ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. రాజస్తాన్‌లోని బరాన్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది.

అసలేం జరిగింది...
పోలీసుల కథనం ప్రకారం... బాధితురాలికి మొదట ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే సంతానం కలగట్లేదన్న కారణంతో ఆమె అతన్ని వదిలేసింది. ఆ తర్వాత రాజస్తాన్‌లోని గిరిజన సంప్రాదాయం 'నటా ప్రాథ' ప్రకారం మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. పెళ్లితో సంబంధం లేకుండా ఇలా స్త్రీ,పురుషుడు కలిసి జీవించేందుకు వారి సంప్రాదాయం అనుమతిస్తుంది. కొన్నాళ్లకు ఆమెకు సంతానం కలిగింది. ముగ్గురు కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. బాధితురాలి సోదరి కూడా ఆమెతో పాటే నివసిస్తోంది.

భర్త కళ్లెదుటే ఆమెపై అఘాయిత్యం...
ఇదే క్రమంలో ఇటీవల భర్తతో కలిసి బైక్‌పై ఆమె స్థానిక ఆలయానికి వెళ్లింది. తిరిగొస్తున్న క్రమంలో మార్గమధ్యలో ఓ గ్యాంగ్ వారిని అడ్డగించారు. అందులో ఆమె మాజీ భర్త సోదరుడు ఉన్నాడు. ఇద్దరినీ బలవంతంగా సమీపంలోని పంట పొలం వద్దకు లాక్కెళ్లారు. అతనిపై దాడి చేసి కాళ్లు,చేతులు తాళ్లతో కట్టిపడేశారు. అనంతరం అతని ముందే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎలాగోలా వారి చెర నుంచి తప్పించుకుని బాధితురాలు రోడ్డు పైకి పరిగెత్తుకొచ్చింది. దీంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.

కేసు నమోదు.. కొనసాగుతున్న దర్యాప్తు...
హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలిని,ఆమె భర్తను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆదివారం(మార్చి 14) ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా... సోమవారం(మార్చి 15) కోర్టులో ఆమె వాంగ్మూలం రికార్డు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసులో మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు,ఆమె మాజీ భర్త గతంలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications