యువతికి వేధింపులు: కదుల్తున్న రైలు నుంచి తోసివేత

అంతటితో ఆగకుండా ఆమె వద్ద ఉన్న వస్తువులను దోచుకునేందుకూ ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో రైల్లోంచి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం జరిగిన ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
పబ్లిక్ నల్లా వద్ద గొడవ: భవనంపై నుంచి తోసేసి వ్యక్తి హత్య
నోయిడా: మున్సిపల్ నీటిని సరఫరా చేసే పంపు వద్ద మొదలైన చిన్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని తీసింది. నీళ్ల కోసం గొడవపడిన నలుగురు వ్యక్తులు మరో వ్యక్తిని నాలుగంతస్తుల భవనంపై నుంచి తోసేసి హత్య చేశారు. ఈ దారుణ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది.
బాధితుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం... మృతుడు ఇష్రాఫిల్ హుస్సేన్(37) నోయిడాలోని వస్త్ర దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, ఆదివారం ఉదయం 7.45కి నల్లా నీటిని పట్టుకునేందుకు ట్యాప్ వద్దకు వెళ్లాడు. అక్కడ జహంగీర్ అనే వ్యక్తి హుస్సేన్‌ను అడ్డుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
జహంగీర్ బంధువులైన సాబీర్, నజీర్‌లు ఘటన స్థలానికి చేరుకుని హుస్సేన్‌పై దాడి చేశారు. ఆ తర్వాత అతడ్ని భవనం నాలుగో అంతస్తుపై నుంచి కిందికి తోసేశారు. తీవ్రగాయాలపాలైన హుస్సేన్‌ను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే హుస్సేన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జహంగీర్, సాబీర్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, నజీర్ పరారీలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications