ఐదుగురు 'భర్తలను' దోచుకున్న మహిళ అరెస్టు
కోట: ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మహిళతో పాటు ఆమె అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని బారన్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వారి నగదును, విలువైన వస్తువులను దోచుకెళ్లింది. ఈ విషయాన్ని పోలీసులు మంగళవారంనాడు వెల్లడించారు.
ఐదారుగురు గల ముఠాలో కుసుమ్ అలియాస్ పూజ ఓ సభ్యురాలని, వారు డబ్బుతో విలువైన వస్తువులతో పారిపోవడం ఆనవాయితీగా పెట్టుకున్నారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ గంగా సహాయ శర్మ చెప్పారు. కసుమ్‌తో పాటు ఆమె అనుచరులు అశోక్, జుగల్ కిశోర్‌లను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

తాను ఐదుగురు మగాళ్లను పెళ్లి చేసుకుని ఆ తర్వాత వారికి చెందిన విలువైన వస్తువులతో పారిపోయినట్లు కుసుమ్ విచారణలో అంగీకరించినట్లు గంగా సహాయ శర్మ చెప్పారు. కుసుమ్‌ను ఆమె భర్త అశోక్ కుమార్ మీనా బంధించాడని ఆరోపిస్తూ అశోక్, జుగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి బండారం బయటపడింది.
పెళ్లి సమయంలో మీనా కుసుమ్ బంధువుగా చెప్పుకున్న అశోక్‌కు 1.50 లక్షల రూపాయలు ఇచ్చాడని విచారణలో తేలింది. కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతర ముఠా సభ్యులను కూడా అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications