స్నానం చేయడు, పళ్లు తోమడు, గడ్డం కూడా తీసుకోడు, విడాకులు ఇప్పించండి స్వామీ...
అప్పుడప్పుడు వింత ఘటనలు, విశేషాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోనూ జరిగింది. తన భర్తపై వివాహిత ఏకంగా మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. అతనితో ఉండలేను మొర్రొ అని..విడాకులు ఇప్పించమని కోరింది. కేసు చూసి మహిళా కమిషన్ తొలుత షాక్‌నకు గురైంది. తర్వాత వారికి సర్దిచెప్పి.. కొంత గడువు కూడా ఇచ్చింది.

మొరటు భర్త..
పుణెకు చెందిన ఓ జంట కలిసి ఉంటున్నారు. అయితే వారికి పిల్లలు కూడా లేరు. భర్త ప్లంబర్ పనిచేయడంతో.. కాస్త మొరటుగా ఉంటున్నాడు. దీనిపై భార్య సర్దుకుపోయినా.. చివరికి అతనితో ఉండలేను మొర్రో అని చెప్పేసింది. తన భర్త గురించి మహిళా కమిషన్‌కు ఫిర్యాదులో అన్నీ అంశాలను వివరించింది.

10 రోజులు
భర్త రోజు స్నానం చేయడని, అపరిశుభ్రంగా ఉంటారని విన్నవించారు. పళ్లు కూడా తోముకోడని, షేవ్ చేసుకోడని.. 10 రోజులపాటు ఇలాగే ఉండిపోతాడని మహిళా కమిషన్ ముందు వాపోయింది. అతనితో ఉండలేనని.. విడాకులు ఇప్పించాలని వేడుకుంది. దీనిపై మహిళా కమిషన్ తొలుత షాక్‌నకు గురైంది. తర్వాత భర్తను పిలిపించి మాట్లాడింది.

కలిసి ఉండాలని ఉంది..
తనకు భార్యతో ఉండాలని ఉంది అని భర్త చెప్పాడు. కానీ భార్య మాత్రం తాను ఉండనని తేల్చిచెప్పింది. తమకు పిల్లలు కూడా లేరని, దాంపత్య జీవితం వ్యర్థమని చెప్పింది. తమ నగలు తిరిగి ఇచ్చేయాలని అత్తింటివారిని కోరింది. విడాకులు ఇప్పించేందుకు అంగీకరించిన మహిళా కమిషన్.. కలిసి ఉండేందుకు చివరి ప్రయత్నం చేసింది. పద్ధతి మార్చుకోవాలని భర్తకు సూచించింది. రెండునెలల సమయంలో కూడా మార్పు రాకుంటే.. ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలని సలహా ఇచ్చింది.












Click it and Unblock the Notifications