యోగి అభ్యంతరకర ఫోటో: 'ఆమెకు ఇది అలవాటుగా మారింది, ఎన్నో కేసులు'
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై దుష్ప్రచారం చేశారన్న కారణంతో బెంగళూరు పోలీసులు ప్రభ ఎన్ బెళవంగల అనే మహిళపై కేసు నమోదు చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా ఆమె యోగిపై అభ్యంతరకర ఫోటోలు పెట్టాలని బీజే
బెంగళూరు: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై దుష్ప్రచారం చేశారన్న కారణంతో బెంగళూరు పోలీసులు ప్రభ ఎన్ బెళవంగల అనే మహిళపై కేసు నమోదు చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా ఆమె యోగిపై అభ్యంతరకర ఫోటోలు పెట్టాలని బీజేపీ యువమోర్చా ఫిర్యాదు చేసింది.
దీనిపై బీజేపీ యువమోర్చా నేతలు స్పందించారు. యోగి ఆదిత్యానాథ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు మార్ఫింగ్, ట్యాంపర్ చేసి ఫోటోలు పెట్టారని ఆరోపించారు. బీజేపీ యువమోర్చా ప్రెసిడెంట్ సప్తగిరి గౌడ మాట్లాడారు.

ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి పెట్టారు
ఫోటోలను మార్ఫింగ్ చేసి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిత్యనాథ్‌ను చాలా దారుణంగా చూపించే ప్రయత్నం చేశారని, ఆయన పరువుకు భంగం కలిగించే ప్రయత్నాలు చేశారన్నారు.
ప్రభ ఎన్ బెళవంగల ఉద్యేశ్యపూర్వకంగానే ఇలా చేసారని, ఇది పబ్లిక్ పీస్ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పారు.

పలు సెక్షన్ల కింద కేసు
యోగి ఆదిత్యనాథ్‌పై ఉద్దేశ్యపూర్వకంగా మార్ఫింగ్ ఇమేజ్‌లు పెట్టారనే ఆరోపణలపై ప్రభ మీద ఐటీ యాక్ట్ సెక్షన్ 67, 153ఏ, 292ఏ, 499, 500, 505 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇరువర్గాల మధ్య శతృత్వాన్ని పెంచేందుకే..
సెక్షన్ 153ఏ అంటే.. రెండు వర్గాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహించడం. ఈ సెక్షన్ కింద ప్రభపై కేసు నమోదు చేశారు. అసభ్యకర పోస్టులు, దుర్భాషాలాడుతున్న సెక్షన్ కూడా నమోదు చేశారు. సెక్షన్ 499 అంటే ఉద్దేశ్యపూర్వకంగా అపకీర్తి కలిగించడం, సెక్షన్ 500 అంటే అపకీర్తి కలిగించినందుకు శిక్ష.

ఆమెకు ఇది అలవాటే
యోగి ఆదిత్యనాథ్ అభ్యంతరకర ఫోటో పెట్టిన ప్రభ ఎన్ బెళవంగలకు ఇలా చేయడం అలవాటుగా మారిందని యువమోర్చా నాయకుడు సప్తగిరి గౌడ ఆరోపించారు. కించపర్చడం, పుకార్లు గుప్పించడం అలవాటుగా మారిందన్నారు. గతంలో చాలాసార్లు ఆమె ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేశారని, ఆమెపై కేసులు కూడా ఉన్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications