మరో ఘోరం: మహిళపై ఏడుగురు గ్యాంగ్‌రేప్, ముక్కలుగా నరికేశారు

Subscribe to Oneindia Telugu

ఛండీఘర్: నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో దోషులకు ఇటీవలే సుప్రీం కోర్టు ఉరిశిక్ష విధించినా.. ఈ మానవ మృగాలకు బుద్ధిరావడం లేదు. నిర్భయ తరహాలోనే హర్యానాలో తాజాగా మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులు, ఆ తర్వాత ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేశారు.

హర్యానాలోని రోహ్‌తక్‌లో చోటు చేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహ్‌తక్‌కు చెందిన ఓ మహిళ మే 9న విధులకు వెళ్తుండగా.. ఏడుగురు వ్యక్తులను ఆమెను అపహరించుకొని వెళ్లారు. ఆ తర్వాత ఆమెపై క్రూరంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Woman brutally gang-raped, her body mutilated in Rohtak

అనంతరం ఆమె శరీరభాగాలను ముక్కలుముక్కలుగా నరికి హత్య చేశారు. అక్కడితో ఆగని ఆ మానవమృగాలు.. సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు మహిళ ముఖంపై నుంచి వాహనాన్ని నడిపి.. ఛిద్రం చేశారు.

అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే మహిళ ఎవరన్నది తెలుసుకోడానికి మాత్రం మూడు రోజులు పట్టింది. మిస్సింగ్‌ కేసు ఆధారంగా విచారణ చేపట్టడంతో మహిళ వివరాలు తెలిశాయని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం ఇప్పటికే గాలింపు చేపట్టామని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a chilling reminder of the December 2012 Nirbhaya gangrape case, a woman in Haryana’s Rohtak was brutally gang-raped and murdered.
Please Wait while comments are loading...