వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తను భుజాలపై మోసుకెళ్ళిన భార్య, స్పందించిన మంత్రి

By Narsimha
|
Google Oneindia TeluguNews

మధుర: నరాల వ్యాధితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న భర్తను ఆసుపత్రికి తన భుజాలపై ఆసుపత్రికి తీసుకెళ్ళిన ఓ భార్య ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ ఫోటో మంత్రి దృష్టికి రావడంతో ఆ కుటుంబానికి సహయం అందింది.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు చెందిన బిమ్లాదేవి, బదన్ సింగ్ భార్య, భర్తలు. బదన్ సింగ్‌కు నరాల బలహీనతతో అనారోగ్యానికి గురయ్యాడు. అంతేకాదు కుడికాలు కూడ పూర్తిగా దెబ్బతింది.

Woman Carried Disabled Husband For Weeks. Help Came As Photo Went Viral

బదన్‌సింగ్‌కు వీల్ ఛైర్ కోసం బిమ్లాదేవి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. అయితే బదన్ సింగ్ వికలాంగుడని సర్టిఫికెట్ తీసుకురావాలని ప్రభుత్వాసుపత్రి సిబ్బంది చెప్పారు. దీంతో ఆమె ఆసుపత్రి చుట్టూ, వికలాంగుల సర్టిఫికెట్ కోసం ఆమె భర్తను తన భుజాలపై మోసుకొని వెళ్ళింది.

అయితే భర్తను తన భుజాలపై తీసుకెళ్తున్న బిమ్లాదేవిని ఎవరో ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఉత్తరప్రదేశ్‌ మంత్రి భూపేంద్ర చౌదరి కంట పడింది. వెంటనే బిమ్లాదేవి భర్త బదన్ సింగ్ కు సహయం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Woman Carried Disabled Husband For Weeks. Help Came As Photo Went Viral

ఇంతకాలం పాటు వారికి సహయం అందకపోవడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఘటన నాగరిక సమాజం సిగ్గుపడేదని ఆయన అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబానికి సహయం అందేలా చేస్తామని ఆయన హమీ ఇచ్చారు.

బిమ్లాదేవి కుటుంబానికి బుధవారం నాడు వికలాంగుల ధృవీకరణ పత్రం అందింది. అతనికి మూడు చక్రాల సైకిల్ అందించడం జరిగింది. దీంతో ఆ దంపతులు సంతోషపడుతున్నారు. భర్తకు నరాల వ్యాధికి గురి కావడంతో ఆ కుటుంబాన్ని పోషించడం బిమ్లాదేవిపైనే పడింది.

English summary
Every day for the last few months Bimla Devi has been carrying her husband on her back to a government health centre, from her home in Gita Vihar near Uttar Pradesh's Mathura. Her husband Badan Singh's right leg was amputated after a nerve-related illness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X