విదేశాల్లో ఉద్యోగం, బిడ్డ నాకు పుట్టిందని గ్యారంటీ లేదు, మహిళా ఇంజనీరు షాక్, భర్త ఇంటి ముందే!
చెన్నై: నాతో కాపురం చేసినందుకే నీకు ఈ బిడ్డ పుట్టిందని గ్యారెంటీ లేదని, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ విదేశాల్లో ఉన్న భర్త తేల్చి చెప్పడంతో భార్య రగిలిపోయింది. తనకు పుట్టిన బిడ్డతో సహ తమిళనాడులో భర్త ఇంటి ముందు ధర్నా చేసింది. తనకు న్యాయం చెయ్యాలని, తన భర్తకే ఈ బిడ్డ పుట్టిందని నిరూపించుకోవడానికి డీఎన్ఏ పరీక్షలు చేసుకోవడానికి తాను సిద్దంగా ఉన్నానని, మరో పెళ్లి చేసుకోవడానికి తన భర్త పక్కా ప్లాన్ వేస్తున్నాడని, తనకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ మహిళా ఇంజనీరు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. నెలలోపు నీ భర్తను భారత్ కు పిలిపిస్తామని పోలీసులు, అధికారులు హామీ ఇవ్వడంతో మహిళా ఇంజనీరు తాత్కాలికంగా ఆందోళన విరిమించింది.

ఇద్దరూ ఇంజనీర్లు
తమిళనాడులోని తెన్ కాశీ జిల్లా కడైయమ్ సమీపంలోని కట్టెలి పట్టి కీళ వీధిలో నివాసం ఉంటున్న మురుగన్ (30), ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న తేన్ మొళి (27)కి గత ఫిబ్రవరి నెలలో వివాహం అయ్యింది. మురుగన్, తేన్ మొళి ఇద్దరూ ఇంజనీర్లు. పెళ్లి జరిగిన తరువాత మురుగన్, తేన్ మొళి దంపతులు సంతోషంగానే ఉన్నారు.

విదేశాల్లో ఉద్యోగం
వివాహం జరిగిన తరువాత కొన్ని నెలల పాటు భార్యతో కాపురం చేసిన మురుగన్ ఉద్యోగం చెయ్యడానికి ఇండోనేషియా వెళ్లాడు. తేన్ మొళి కోయంబత్తూరు (కోవై)లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. మురుగన్ ప్రస్తుతం ఇండోనేషియాలో ఉంటున్నాడు.

ఆడపిల్ల పుట్టిందని !
తేన్ మొళి గర్బంతో ఉండటంతో ఉద్యోగానికి సెలవు పెట్టి పుట్టింటిలో ఉంటోంది. పుట్టింటికి వచ్చిన తరువాత తేన్ మొళి విదేశాల్లో ఉన్న భర్త మురుగన్ తో ఫోన్ లొ మాట్లాడుతోంది. నవంబర్ నెలలో తేన్ మొళికి ఆడ బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన రోజే విదేశాల్లో ఉన్న భర్త మురుగన్ కు విషయం చెప్పింది.

ఈ బిడ్డ నాకు పుట్టిందని ఏం గ్యారెంటీ ?
బిడ్డను చూడటానికి వెంటనే ఇంటికి రావాలని భార్య తేన్ మొళి భర్త మురునగర్ కు చెప్పింది. ఇప్పుడు సెలవులు లేవని, వెంటనే రావడం కుదరదని, వీలు చూసుకుని వస్తానని ఇండోనేషియాలో ఉన్న మురుగన్ ఇన్ని రోజులు కాలం గడుపుతూ వచ్చాడు. అయితే వారం రోజుల క్రితం హఠాత్తుగా ఫోన్ చేసిన మురుగన్ ఈ బిడ్డ తనకు పుట్టలేదని భార్య తేన్ మొళికి షాక్ ఇచ్చాడు. నిన్ను, నీ బిడ్డను చూడటానికి తాను ఎప్పటికీ ఇంటికి రానని తేల్చి చెప్పాడు.

డీఎన్ఏ పరీక్షలు చేస్తే అసలు నిజం !
భర్త మురుగన్ మాటలతో భార్య తేన్ మొళి దిగ్భ్రాంతికి గురైయ్యింది. బిడ్డతో కలిసి భర్త మురుగన్ ఇంటి ముందుకు వచ్చిన తేన్ మొళి ధర్నాకు దిగింది. విషయం తెలుసుకున్న స్థానికులు మురుగన్ చెప్పిన మాటలు తెలుసుకుని షాక్ కు గురైనారు. మురుగన్ కాపురం చెయ్యడంతో ఈ బిడ్డ పుట్టిందని, తాను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడానికి డీఎన్ఏ పరీక్షలు చేసుకోవడానికి సిద్దంగా ఉన్నానని తేన్ మొళి తేల్చి చెప్పింది.

రా రా తేల్చుకుందాం
విషయం తెలుసుకున్న గ్రామ నిర్వహణ అధికారి సుడర్ సెల్వన్, స్థానిక పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తేన్ మొళితో చర్చలు జరిపారు. నెలలోపు మురుగన్ ను భారత్ పిలిపించి మీకు న్యాయం చేస్తామని అధికారులు, పోలీసులు హామీ ఇవ్వడంతో తేన్ మొళి తాత్కాలికంగా ధర్నా విరమించింది. నువ్వు భారత్ కు రా రా, ఎవరు తప్పు చేశారో చూద్దాం, మనం మనం తేల్చుకుందాం అంటూ తేన్ మొళి భర్త మురుగన్ ను హెచ్చరించింది
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications