లావుగా ఉన్నావ్ ..అందంగా లేవు; తలాక్ ఇస్తా అన్న భర్త .. అత్తారింటి వేధింపులకు వివాహిత బలి !!

లావుగా ఉన్నావు... అందంగా లేవు. నువ్వు నాకు వద్దు.. నీకు తలాక్ ఇచ్చేస్తా అంటూ నిత్యం ఓ భర్త వేధించడంతో ఓ భార్య వేధింపులు భరించలేక తనువు చాలించింది. భర్తతోపాటు అత్తమామలు సైతం గృహహింసకు పాల్పడడంతో ఎవరికీ చెప్పుకోలేక ఓ నిర్భాగ్యులు ప్రాణం తీసుకుంది. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా, గృహహింసకు పాల్పడకుండా మహిళను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా నిత్యం ఏదో ఒక చోట మహిళలపై హింస చోటు చేసుకుంటూనే ఉంది.

లావుగా ఉందని, అందంగా లేదని వేధిస్తున్న భర్త

లావుగా ఉందని, అందంగా లేదని వేధిస్తున్న భర్త

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్తారింటి వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది.
ఎస్ ఆర్ నగర్ పోలీసుల వివరాల మేరకు నారాయణఖేడ్ కు చెందిన 25 సంవత్సరాల హలీమా బేగం కు బోరబండ స్వరాజ్ నగర్ కు చెందిన 32 ఏళ్ల అబ్దుల్ హాసిఫ్ తో 2018లో వివాహమైంది. వీరికి రెండున్నర ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. హలీమా బేగం ను హాసిఫ్ బాగా లావుగా ఉందని, అందంగా లేదని గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు.

మరో పెళ్ళికి రెడీ .. కోడలికి అత్తమామల వేధింపులు

మరో పెళ్ళికి రెడీ .. కోడలికి అత్తమామల వేధింపులు

మరో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. ఇక భర్తతోపాటు అత్త బీబీ ఫాతిమా, మామ అబ్దుల్ జానీమియా కూడా సూటిపోటి మాటలు అంటూ హలీమాను వేధించేవారు. ఇక అత్తారింటి వేధింపులు తట్టుకోలేక హలీమా తన తల్లికి ఫోన్ చేసి తనను అక్కడ్నుండి తీసుకువెళ్లాలని, నిత్యం వేరే పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నారని చెప్పి తన బాధను వ్యక్తం చేసింది. ఆ తర్వాత తల్లి హలీమాకు ఫోన్ చేసినా ఆమె ఫోన్ తీయక పోవడంతో, అనుమానం వచ్చిన హలీమా తల్లిదండ్రులు హలీమా అత్తవారింటి ల్యాండ్ లైన్ నెంబర్ కు ఫోన్ చేశారు.

 ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న మహిళ, పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న మహిళ, పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

హలీమా తోడికోడలు హలీమా ఆత్మహత్యకు పాల్పడిందని వారితో చెప్పడంతో నగరానికి చేరుకున్న తల్లిదండ్రులు హలీమా మృతికి అత్తమామలు, భర్త కారణమని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిత్యం తన కుమార్తెను వేధింపులకు గురి చేశారని ఆమె బలవన్మరణానికి వారే కారణమంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను, తన కుమారుడిని ఇంటికి తీసుకు వెళ్ళమని కోరిన హలీమా అంతలోనే ఆత్మహత్యకు పాల్పడటం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కూడా వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హలీమా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 ఇంకా గుట్టు చప్పుడు కాకుండా ట్రిపుల్ తలాక్ .. ఆత్మహత్యలకు పాల్పడుతున్న బాధిత మహిళలు

ఇంకా గుట్టు చప్పుడు కాకుండా ట్రిపుల్ తలాక్ .. ఆత్మహత్యలకు పాల్పడుతున్న బాధిత మహిళలు

ట్రిపుల్ తలాక్ ఇవ్వడం నేరమంటూ కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకు వచ్చిన ఇంకా ముస్లిం మహిళలు తలాక్ బాధితులుగానే మారుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ట్రిపుల్తలాక్ వ్యవస్థతో విడాకులు తీసుకుంటున్న వారు లేకపోలేదు. అయితే చాలామంది ముస్లిం మహిళలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముస్లిం మహిళల రక్షణ కోసం చట్టాన్ని చేసింది. ఇప్పటికీ చాలామంది మహిళలు భర్తలు అత్తమామల వేధింపులకు ఎదురు తిరగలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక ఈ కోవలోనే తాజాగా హలీమా ఆత్మహత్య కూడా ముస్లింల తలాక్ వివాహ వ్యవస్థను మరోమారు ప్రశ్నిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+