మహిళపై అత్యాచారం, సోషల్ మీడియాలో వీడియో
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మరోసారి దారుణం వెలుగు చూసింది. ఇటీవల ఓ నర్స్ పైన అత్యాచారానికి పాల్పడి, ఆమె వీడియోను సోషల్ వర్కింగ్ సైట్లలో పెట్టారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.
ఇది ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

సమాచారం మేరకు... ముజఫర్‌నగర్‌కు చెందిన 36ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను వీడియో తీసి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అంతటితో ఊరుకోకుండా ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం మహిళను ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications