మహిళా కానిస్టేబుల్‌పై వేధింపులు: ఇన్‌స్పెక్టర్‌పై ఫిర్యాదు

ముజఫర్‌నగర్: ప్రజలకు, మహిళలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు, తమ డిపార్ట్‌మెంట్‌లోని మహిళలకు కూడా రక్షణ ఇవ్వలేకపోతున్నట్లు కన్పిస్తోంది ఈ సంఘటనను గమనిస్తే. ఓ మహిళ కానిస్టేబుల్ తన పైఅధికారి తనను ఈవ్ టీజింగ్ చేస్తున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజాఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది.

పోలీస్ కమిషనర్ శ్రవణ్ కుమార్ కథనం ప్రకారం.. పోలీస్ కంట్రోల్ రూమ్ ఇంఛార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న రన్వీర్ తోమర్.. అక్కడే కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళను గత నెల రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

Woman constable alleges eve-teasing by inspector in UP

బాధిత మహిళ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామని ఎస్పి తెలిపారు. మహిళా కానిస్టేబుల్‌ను వేధింపులకు గురి చేసినట్లు రుజువైతే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇప్పటికే ఘటనపై విచారణ ప్రారంభించినట్లు తెలిసారు.

ఈ విషయంపై రన్వీర్ తోమర్‌ను సంప్రదించగా.. తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని అన్నారు. విధులకు సరైన సమయంలో రాకపోవడంతో ఆమెను మందలించినట్లు తెలిపారు. కాగా, ఉన్నతాధికారులు సదరు మహిళా కానిస్టేబుల్‌ను వేరొక స్టేషనుకు బదిలీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+