మహిళా కానిస్టేబుల్‌పై ఎఎస్పీ లైంగిక వేధింపులు, సీఎంకు ఫిర్యాదు
మధ్యప్రదేశ్‌లో మహిళా కానిస్టేబుల్‌పై ఎఎస్పీ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనం కల్గించింది. ఈ ఘటనపై బాధితురాలు సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్‌కు ఫిర్యాదు చేశారు.
భోపాల్: మధ్యప్రదేశ్‌లో మహిళా కానిస్టేబుల్‌పై ఎఎస్పీ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనం కల్గించింది. ఈ ఘటనపై బాధితురాలు సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్‌కు ఫిర్యాదు చేశారు.
అడిషనల్ ఎస్పీ రాజేంద్ర వర్మ తనను లైంగికంగా వేధించినట్లు ఒక మహిళా కానిస్టేబుల్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపుల వల్ల మానసికంగా, శారీరకంగా కుంగిపోయినట్లు ఆమె పేర్కొన్నారు. రాజేంద్ర వర్మపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలను తీసుకోవాలని ఆమె కోరారు.

నిందితుడిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. అదే సమయంలో మూడునాలుగు నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టి ప్రశాంతంగా ఉండాలని చౌహాన్ సూచించినట్లు ఆమె తెలిపారు.


Click it and Unblock the Notifications