• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరో నిర్భయ ఘటన: మహిళపై మాజీ భర్తే అత్యాచారం చేసి చంపేశాడు

|

జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై తన మాజీ భర్త అతని స్నేహితులు కలిసి అత్యంత భయంకరంగా ఆమెపై అత్యాచారం చేశారు. ఆలస్యంగా ఆ ఘటన వెలుగు చూసింది. సామూహిక అత్యాచారం చేయడంతో మహిళ మృతి చెందింది.

 కఠిన చట్టాలను లెక్క చేయని కామాంధులు

కఠిన చట్టాలను లెక్క చేయని కామాంధులు

మహిళలపై అత్యాచారాలను అరికట్టాలని ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం కదలిక రావడం లేదు. ఆ చట్టాలు వాటి సీరియస్‌నెస్ మృగాళ్ల చెవికి ఎక్కడం లేదు. చట్టాలతో మా కేంటి పని అంటూ దారుణంగా మహిళలపై తెగబడుతున్నారు. కామంతో ఊగిపోయి చివరకు మహిళల మానప్రాణాలను తోడేస్తున్నాయి మగ తోడేళ్లు. ఒంటరిగా స్త్రీ కనపడితే చాలు... ఎప్పుడెప్పుడు తెగబడుదామా అన్న ఆతురతో ఈ మృగాళ్లు ఎదురు చూస్తున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే పక్కింటి వారు, లేదా పొరుగింటివారే లేదా బంధువులే మహిళలపై లైంగిక దాడికి పాల్పడతుండటంతో మహిళ భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

పొలాల్లోకి తీసుకెళ్లి అత్యంత పాశవికంగా అత్యాచారం

పొలాల్లోకి తీసుకెళ్లి అత్యంత పాశవికంగా అత్యాచారం

తాజాగా జార్ఖండ్‌లో నిర్భయ తరహా ఘటనే చోటుచేసుకుంది. కాళీ పూజా రోజున అంటే బుధవారం రాత్రి ఓ మహిళ సినిమా చూసి వస్తుండగా ఆమెపై ముగ్గురు మగాళ్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. తనను వదిలివేయాల్సిందిగా పదే పదే వేడుకొన్నప్పటికీ మృగాళ్లలో కనికరం కలగలేదు. ఆమెను దూరంగా పొలాల్లోకి తీసుకెళ్లి వంతుల వారీగా అత్యాచారం చేశారు. అంతేకాదు ఆమె ప్రైవేట్ భాగాల్లోకి కర్రను దూర్చి అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. ఆ రాత్రి అంతా ప్రాణాలతోనే నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మహిళను మరుసటి రోజు ఉదయం కొందరు గ్రామస్తులు గమనించారు. అప్పటికీ ప్రాణాలతోనే కొన ఊపిరితో ఉన్న ఆమెను ముందుగా దగ్గరలోని నారాయణపూర్ హాస్టిటల్‌కు తరలించారు. అయితే వైద్యులు మెరుగైన చికిత్స కోసం జామతారా సర్దార్ హాస్పిటల్‌కు తరలించాల్సిందిగా సూచించారు. ఆస్పత్రికి చేరుకోగానే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

మహిళ మాజీ భర్తే స్నేహితులతో కలిసి అత్యాచారం

మహిళ మాజీ భర్తే స్నేహితులతో కలిసి అత్యాచారం

ఇదిలా ఉంటే స్థానికులు బంధువులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ ప్రాణాలతో ఉన్న సమయంలో ఈ దారుణానికి పాల్పడింది ఆమె మాజీ భర్తే అని తమతో చెప్పినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఆమె మాజీ భర్తతో పాటు మరో ఇద్దరు కూడా ఆమెపై అత్యాచారం జరిపినట్లు మహిళ చెప్పినట్లు పోలీసులకు తెలిపారు గ్రామస్తులు. మహిళ మాజీ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman died after she was allegedly raped by three men, including her former husband, and a stick was inserted in her private parts in Jamtara district of Jharkhand, police said on Thursday.Senior Police officer B N Singh said the woman's ex-husband has been arrested a search is on to arrest the two others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more