ఆఫీస్ నుంచి ఈడ్చుకెళ్లి.. రాత్రంతా అత్యాచారం చేశాడు(వీడియో)
ఛండీఘర్: సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ముక్త్సర్ నగరంలోని ఓ కంప్యూటర్ సెంటర్‌లో పని చేస్తున్న ఓ దళిత యువతి(24)ని అందరూ చూస్తుండగానే ఆమె గ్రామానికే చెందిన ఓ వ్యక్తి ఈడ్చుకుంటూ వెళ్లాడు.
ఆ తర్వాత కారులో కుదేసి, ఫాంహౌస్ కు తీసుకెళ్లి రాత్రంతా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫాంహౌజ్‌లో అత్యాచారం చేసి అనంతరం ఒకరోజు తర్వాత విడిచిపెట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన మార్చి 25న చోటుచేసుకుంది. మహిళను కిడ్నాప్ చేయడం అక్కడి షాపు సీసీ టీవీలో రికార్డు అయింది.

కాగా, జరిగిన దారుణంపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఆఫీసు వారు కూడా సాక్ష్యం చెబుతామని ముందుకు వచ్చారు. ఆమెను లాక్కెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
దీంతో బాధితురాలు తన తండ్రితో కలిసి జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించింది. సాక్ష్యాధారాలు ఉన్నా, ఇంత దారుణం జరిగినా కేసు ఎందుకు నమోదు చేయలేదో వివరణ ఇవ్వాలని జిల్లా సీనియర్ పోలీస్ అధికారికి జాతీయ ఎస్సీ కమీషన్ నోటీసులు జారీ చేసింది. కాగా, శనివారం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications