మహిళ పట్ల ఏఏపీ ఎమ్మెల్యే అసభ్యప్రవర్తన(వీడియో)

ఢిల్లీ: నీళ్ల కోసం వెళ్తే తన పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఏపీ ఎమ్మెల్యే దినేష్ మోహానియా కార్యాలయానికి తాను వెళ్తే గుర్తు పట్టేందుకు ఆయన నిరాకరించారని ఆమె చెప్పారు.

తాను చాలా రోజులుగా నీళ్ల సమస్య పైన ఆయన కార్యాలయానికి వెళ్తున్నానని, కానీ గుర్తు పట్టనట్లుగా వ్యవహరించారని ఆమె చెప్పారు. నీళ్ల గురించి అడగగానే తనతో పాటు ఇతర మహిళలను నోటికి వచ్చినట్లు తిట్టారని, తమను తోసేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దినేష్ మోహానియా పైన కేసు పెట్టి, అతనిని అరెస్టు చేయాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆయన తమను తిట్టి, తోసేయడంతో తాము కూడా అలాగే చేశామని, తాము ఆయన కార్యాలయానికి వెళ్లింది కొట్టించుకోవడానికా అని ప్రశ్నించారు.

నీటి సమస్యను పరిష్కరించాలనే తాము ఆయనను కలిశామని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే దినే్ మాట్లాడుతూ.. తనను అప్రతిష్ట పాలు చేసేందుకే ఫిర్యాదు చేశారని విమర్శించారు. తన మీద ఫిర్యాదు చేసిన మహిళ ఇప్పటి వరకు తన కార్యాలయానికి రాలేదని, అలా వచ్చినట్లు ఆధారాలు కూడా లేవన్నారు. నీళ్ల మాఫియాను తాము అణిచివేయడంతో కక్ష కట్టి ఇలా చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+