లిఫ్ట్ లో బాలుడిని కుక్క కరిచినా పట్టించుకోని మహిళ.. జరిమానా వేసిన మున్సిపల్ కార్పోరేషన్!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ కు చెందిన ఒక బాలుడిని అపార్ట్మెంట్ లిఫ్ట్ లో కుక్క కరిచిన ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. సదరు మహిళకు జరిమానా విధించారు.

లిఫ్ట్ లో బాలుడిని కరిచిన కుక్క.. పక్కనే ఉన్నా మానవత్వం చూపని మహిళ.. వీడియో వైరల్

అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ కు చెందిన ఒక బాలుడు తన పాఠశాల ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో, తాము ఉంటే ఫ్లాట్ లోకి వెళ్ళడానికి అపార్ట్మెంట్లో ఒక లిఫ్ట్ ఎక్కాడు. మరొక ఫ్లోర్లో లిఫ్ట్ లోకి ఒక మహిళ తనతో పాటు ఒక కుక్కను తీసుకొని ఎక్కింది. కుక్కని చూసిన బాలుడు అప్పటికే భయపడి దిగుదామని ముందుకు కదిలేలోగానే బాలుడిని ఆ కుక్క కరిచింది. కుక్క కరిచిన బాధతో పిల్లవాడు అల్లాడుతున్నా అదేమీ పట్టనట్టు సదరు మహిళ కామ్ గా నిలబడింది. ఇక తాను దిగాల్సిన ఫ్లోర్ రాగానే తనకేమీ తెలియదన్నట్టు వెళ్ళిపోయింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన సిసి టివి ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మానవత్వం లేని సదరు మహిళ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

సీసీటీవీ ఫుటేజ్ చూసిన తల్లిదండ్రులు షాక్.. మహిళపై ఫిర్యాదు

సీసీటీవీ ఫుటేజ్ చూసిన తల్లిదండ్రులు షాక్.. మహిళపై ఫిర్యాదు

సెప్టెంబర్ 5 సాయంత్రం 6 గంటలకు ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ చార్మ్స్ కౌంటీ సొసైటీలో ఈ సంఘటన జరిగింది. బాలుడిని కుక్క కరిచిన ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ చూసిన తల్లిదండ్రులు కూడా మహిళ ప్రవర్తించిన తీరుకు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో తమ కుమారుడిని కుక్క కరిచిన ఘటనపై, మానవత్వం లేకుండా, తన పెంపుడు కుక్కను ఆపకుండా మహిళ ప్రవర్తించిన తీరుపై బాలుడి తల్లిదండ్రులు నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఫిర్యాదుపై చర్యలు తీసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే లిఫ్టులో బాలుడిని కుక్క కరిచిన వీడియో వైరల్ కావడంతో బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని సర్కిల్ ఇన్స్పెక్టర్ అలోక్ దూబే వెల్లడించారు.ఇక ఈ ఘటన నేపథ్యంలో ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మహిళ ఇంటికి చేరుకుని పెంపుడు కుక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నమోదు కాలేదని గుర్తించారు.

స్పందించిన ఘజియాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ .. మహిళకు రూ.5,000 జరిమానా

స్పందించిన ఘజియాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ .. మహిళకు రూ.5,000 జరిమానా

మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు కుక్కను పెంచుతున్నా దానిని విచ్చలవిడిగా వదిలేస్తున్నారని, ఆ కారణంగా అది జనాలను కరుస్తుందని, దీంతో స్థానికులు భయపడుతున్నారని పేర్కొన్నారు మున్సిపల్ అధికారులు. హౌసింగ్ సొసైటీ లిఫ్ట్‌లో చిన్న పిల్లవాడిని కుక్క కరిచిన ఘటనలో సదరు పెంపుడు కుక్క యజమాని అయిన మహిళపై కార్పోరేషన్ పరిధిలో కుక్కను నమోదు చెయ్యని కారణంగా ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.5,000 జరిమానా విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+