దారుణం: బాలింతపై 12మంది దొంగల గ్యాంగ్‌రేప్

హాపూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానత్వాన్ని మరిచి కామంతో కళ్లుమూసుకుపోయిన 12 మంది దొంగలు ఓ బాలింత మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడారు. 20 రోజుల కిందట ఓ శిశువుకు జన్మనిచ్చిన ఆ మహిళను ఇంట్లోంచి బలవంతంగా పొలాల్లోకి తీసుకెళ్లిన దుండగులు ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

హాపూర్ జిల్లాలోని నారాయణ్‌పూర్ గ్రామంలో షాహిద్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డ 12 మంది కుటుంబ సభ్యులను కొట్టి తాళ్లతో కట్టేశారు. రూ. లక్షన్నవిలువ చేసే ఆభరణాలు, రూ. 20 వేల నగదు, ఇతర విలువైన వస్తువులు దోచుకున్నారు.

Woman gang-raped by 12 robbers in Hapur

ఆ తర్వాత షాహిద్ భార్యను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లిన దొంగలు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

మరో ఘటనలో ఓ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంఘర్ ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తాగు నీటి కోసం వెళ్లిన 17ఏళ్ల యువతిని వెంబడించిన నిందితులు దీపక్, శివం, బ్రిజేష్‌లు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులు దీపక్, శివంలను అరెస్ట్ చేశారు. బ్రిజేష్ పరారీలో ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+