వివాహేతర సంబంధం: కూతురు, కొడుకు ముందే...వివాహితపై గ్యాంగ్‌రేప్

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్‌కతా: వివాహేతర సంబంధం కొనసాగించనని చెప్పినందుకు వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. అంతేకాదు వివాహేతర సంబంధం కొనసాగించనని చెప్పినందుకు కక్షగట్టి వివాహిత జననాంగాలను తీవ్రంగా గాయపర్చడమే కాకుండా తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశారు.బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పశ్చిమ్‌బంగాలో ఓ మహిళపై కీచక పర్వం సాగింది. కొంతమంది మానవ మృగాలు ఆమెపై విరుచుకుపడి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివాహేతర బంధాన్ని ఇక కొనసాగించబోనని చెప్పడంతో కక్షగట్టి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

Woman gang-raped in Bengal, brutalised for refusing to continue affair

పశ్చిమ్‌బంగాలోని బీర్భుంలోని సైంథియా మున్సిపాలిటీలో నివాసం ఉంటున్న మహిళ ఇంటికి సోమవారం ముగ్గురు వ్యక్తులు మద్యం తాగి ప్రవేశించారు. ఆమెపై ముగ్గురు అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ కేసులో కీలక నిందితుడైన తారక్‌ భాస్కర్‌ను పోలీసులు అరెస్టుచేశారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు బీర్భుం జిల్లా ఎస్పీ నీలకంఠ్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు.

బాధిత మహిళకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వృత్తి రీత్యా భర్త వేరే రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. లైంగిక దాడితో బాధిత మహిళ అరుపులు, కేకలు విని ఆమె కుమార్తె తన గది నుంచి బయటకు వచ్చింది.. సహయం చేయాలని కేకలు వేసినా ఇరుగుపొరుగు ఎవరూ ముందుకు రాలేదు. బాధితురాలి జననాంగాలను నిందితులు తీవ్రంగా గాయపర్చారు.

ఎవరూ కూడ సహయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో బాధితురాలని ఆసుపత్రిలో చేర్చేందుకు 5 గంటల సమయం పట్టింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, తక్షణమే ఆపరేషన్‌ చేయాలని వైద్యులు తెలిపారు.బాధిత మహిళకు తారక్‌ భాస్కర్‌తో సంబంధం ఉంది.

అయితే, ఇటీవల ఆమె ఈ వివాహేతర బంధం ఇకముందు కొనసాగించబోనంటూ చెప్పడంతో ఆగ్రహించిన అతడు మహిళను సమీపంలోని బస్టాండ్‌ వద్ద మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి వేధించాడు.

అతడి ప్రవర్తనను సదరు మహిళ ఇరుగుపొరుగు వాళ్లకు చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తారక్‌ భాస్కర్‌ తన స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధితురాలు, స్థానికులు అందించిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman was allegedly gang-raped in West Bengal’s Birbhum district on Monday and a bottle thrust into her private parts after she sought to end an extra-marital affair, police said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X