దారుణం: మహిళపై ఆరుగురు గ్యాంగ్ రేప్
ముజఫర్‌నగర్: ముప్పై ఏళ్ళ మహిళపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. డియోబంద్ నుంచి తన కొత్వాలి ప్రాంతంలోని సొంతూరు బర్కాలికి వస్తున్న ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారిలో ఉన్న ఆరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. నిందితులు లలిత్, పంకజ్, దీపక్, తారా చంద్, సంజయ్‌తో మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు.

గుర్తు తెలియని ఆరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ సంఘటన గురించి పోలీసులు గురువారంనాడు మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications