తుపాకీతో బెదిరింపు: భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై గ్యాంగ్‌రేప్

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఐదు నెలల బాలుడితో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు దంపతులను గుర్తుతెలియని నలుగురు సాయుధులు అడ్డగించారు. ఆ తర్వాత భర్తను చెట్టుకు కట్టేసి, అతడి తలకు తుపాకీ పెట్టి భార్య(23)పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

సహరాన్పూర్ నుంచి షామిలి జిల్లాకు వెళుతున్న సమయంలో సదరు దంపతులపై సాయుధులైన దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని సహరాన్పూర్ ఎస్ఎస్పీ నితిన్ తీవారీ తెలిపారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు.

Woman gang-raped by four as husband held hostage on gunpoint

ఎస్ఎస్పీ నితిన్ తెలిపిన వివరాల ప్రకారం.. కారులో వచ్చిన నలుగురు యువకులు బైక్‌పై వెళుతున్న దంపతులను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆ మహిళను లాక్కెళ్లిన దుండగులు, ఆమె భర్తను తుపాకీతో బెదిరించి చెట్టుకు కట్టేశారు.

అనంతరం మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక, బాధితుల వద్ద ఉన్న నగదు, ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తివారీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+