కదులుతున్న కారులో మహిళపై ముగ్గురు గ్యాంగ్ రేప్

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కదులుతున్న కారులో ముగ్గురు వ్యక్తులు 40 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారంనాడు మురాద్‌నగర్‌లో జరిగింది. అత్యాచారం చేసిన తర్వాత బాధితురాలిని అప్పర్ గంగ కెనాల్ వద్ద పడేసిపోయారు.

ఆమెకు భర్త లేడు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన ఇంటికి సమీపంలోని మీరట్ రోడ్డులో ఆమె చిన్నపాటి ఫలాలు, కూరగాయల దుకాణం నడుపుకుంటోంది. అచేతనంగా పడి ఉన్న మహిళను ఇద్దరు గస్తీ పోలీసులు చూసి మురాద్‌నగర్ పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. వైద్యపరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి పంపించారు.

అత్యాచారం కింద ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరిని బాధితురాలు గుర్తించిందని వారు చెప్పారు. సంజయ్ నగర్‌కు చెందిన వకీల్‌గా, మరో వ్యక్తిని ఇర్ఫాన్‌గా గుర్తించింది. వకీల్ మహిళ నివసిస్తున్న కాలనీలోనే ఈటరీ నడుపుతున్నాడు. ముగ్గురు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

Woman gang-raped in moving car

భర్త చనిపోయిన తర్వాత మూడేళ్ల క్రితం అమ్రోహా నుంచి ఘజియాబాద్ వచ్చింది. ఆమె కుమారుడు తరుచుగా వకీల్ ఈటరీలో ఆహార పదార్థాలు కొనేవాడు. దాంతో వకీల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. మంచి ఉద్యోగం ఇప్పిస్తానని తనను మధ్యాహ్నం రెండున్నర గంటలకు కలవాలని మహిళకు చెప్పాడు. ఆమె అక్కడికి చేరుకోగానే కారులో కూర్చోవాలని చెప్పాడు. ఇర్ఫాన్‌తో పాటు మరో వ్యక్తి అప్పటికే కారులో ఉన్నారు.

మత్తు పదార్థాలు కలిపిన శీతల పానీయాన్ని మహిళకు ఇచ్చారు. అది తాగడంతో ఆమె స్పృహ కోల్పోయింది. దాంతో ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆమెను కెనాల్ పక్కన వదిలేసి వెళ్లిపోయారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+