మరో దారుణం: కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్‌రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీ నగర శివారులో కదులుతున్న బస్సులో ఓ వివాహితపై బస్సు డ్రైవర్, అతని సహాయకుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
బాధితురాలి పోలీసులకిచ్చిన ఫిర్యాదు ప్రకారం.. శనివారం రాత్రి బాధితురాలు దాద్రి వెళ్లేందుకు కనౌజ్ దగ్గర బస్సు ఎక్కింది. అయితే గమ్యస్థానం చేరినా ఆమె గుర్తించకపోవడంతో ఢిల్లీ చేరింది. అయితే బాధితురాలిని దాద్రిలో దించుతామని చెప్పిన బస్సు డ్రైవర్, అతని సహాయకుడు బస్సులో వెనక్కి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు ఆదివారం తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని తెలిపారు.

అసోం రోడ్డు ప్రమాదంలో 12మంది దుర్మరణం
జోర్హాట్: అసోంలోని గోల్‌ఘాట్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12మంది దుర్మరణం పాలయ్యారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. లఖింపూర్ జిల్లా ధకువాఖానా నుంచి దేర్‌గాంవ్‌కు వెళ్తున్న ఒక వాహనం లోటబరి వద్ద జాతీయ రహదారి-37పై ఒక భారీ ట్రక్కును ఢీకొనడంతో వీరంతా అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో ముగ్గురు దంపతులు ఉన్నారు. అయితే ఈ వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ తనను తాను రక్షించుకోవడానికి బయటకు దూకినప్పటికీ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను జోర్హాట్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications