పార్కింగ్ లాట్ కారులో మహిళపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ/ కోల్‌కతా: దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇస్తామని ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు పిలిచి పార్కింగ్ లాట్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జూన్ 19వ తేదీన మహిళ చాణక్యపురి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఉద్యోగం ఇస్తామని చెప్పి తనను హోటల్‌కు పిలిచారని, పార్కింగ్ లాట్‌లో గల కారులో తనపై సామూహిక అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు చేసింది. మే 25వ తేదీన ఓసారి, జూన్ 3వ తేదీన మరోసారి తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆ మహిళ చెప్పింది.

బాలికపై రేప్, హత్య
పశ్చిమ బెంగాల్‌లోని బుర్దాన్ జిల్లాలో ఓ వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు. శుక్రవారంనాడు జిల్లాలోని అందాల్‌లో నేరం జరిగింది.
నిందితుడు సందీప్ బిన్ దేవాలయం కేర్ టేకర్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలు రెండో తరగతి విద్యార్థిని. అతను బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసినట్లు వైద్య పరీక్షల్లో తేలినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications