కదులుతున్న ఆటోలో మహిళపై గ్యాంగ్‌రేప్: తోసేశారు

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు, బాధితురాలి సమీప బంధువు పరారీలో ఉన్నాడని ఎఎస్‌పి రవీంద్రనాథ్ ఆదివారం వెల్లడించారు. గత కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న బాధితురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి అక్రాలో తల్లి దగ్గర జీవిస్తోంది.
జులై 31న సమీప బంధువైన షఫీక్ పిలుస్తున్నాడని చెప్పిన వ్యక్తులతో కలిసి ఇంటి నుంచి ఆటోలో వెళ్లింది. ఆ ఆటోలో మొత్తం నలుగురు వ్యక్తులున్నారు. వారిచ్చిన కూల్‌డ్రింక్ తాగడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి 11 గంటల సమయంలో ఆమెను ఓ ప్రాంతంలో ఆటోలో నుంచి తోసివేసి వెళ్లిపోయారు.
గమనించిన స్థానికులు కోల్‌కతాలోని ఆస్పత్రిలో చేర్పించారని ఎఎస్‌పి తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఇద్దరు నిందితులను అదేరోజు అరెస్టు చేయడంతోపాటు ఆటోను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరో ఇద్దరిని మహేస్థలలో ఆదివారం అరెస్టు చేశామని చెప్పారు.












Click it and Unblock the Notifications