కిడ్నాప్ చేసి మహిళపై గ్యాంగ్‌రేప్, హత్య
బదౌన్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్‌లో మరో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు, ఆ తర్వాత దారుణంగా హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఆమె మృతదేహాన్ని మన్నునగర్ గ్రామంలోని చెరకు తోటలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మహిళ కాళ్లు, చేతులు గట్టిగా కట్టేసి ఉన్న గుర్తులు ఉన్నాయని, శరీరంపై గాయాలు కూడా ఉన్నాయని చెప్పారు. దీంతో మహిళను కిడ్నాప్ చేసి రేప్ చేసి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి.
బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి వివరాలు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications