నగ్నంగా నిలబెట్టి, భర్త సహా 10మంది రేప్: మూత్రం...
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ గిరిజన మహిళపై ఆమె భర్త సహా పదిమంది అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖండ్వా జిల్లా పిప్లాడ్ పోలీసు స్టేషన్ పరిధిలోని భిలాయ్ ఖేడా గ్రామంలో ఇది జరిగింది.
ఆస్తి తగాదాల వల్ల ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. భర్త ప్రోద్బలంతో బంధువులు, ఇతర గ్రామస్తులు పదిమంది కలిసి కత్తులతో ఆయన భార్యపై దాడి చేశారు. ఆమెను ఆరు బయటే వివస్త్రను చేసి మూత్రం తాగాలని బెదిరించారు. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. బంధువులు ఆమెను చికిత్స నిమిత్తం ఖండ్వా జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగింది. అయితే బాధితురాలు శనివారం పోలీసులకు ఈ ఘటన పైన ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, పదిమంది తన పైన అత్యాచారం చేసే ముందు తనను కొట్టారని, ఆ తర్వాత నగ్నంగా నిలబెట్టారని, తాను నీళ్ల కోసం అడిగితే మూత్రం తాగమని బెదిరించారని, ఇదంతా తన మైనర్ తనయుడు ముందు జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications